Chandrababu Naidu: తెలంగాణలో టీడీపీ(TDP) కార్యకలాపాలను యాక్టీవ్ చేయాలని పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) నాయకులను ఆదేశించారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాత్రి టీ టీడీపీ(T-TDP) నేతలతో భేటి అయ్యారు. రెండుగంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ సభ్యత్వం, గ్రామస్థాయి నుంచి కమిటీలు, రాష్ట్ర రాజకీయాలపై చంద్రబాబు ఆరా తీశారు. తెలంగాణ(Telangana) రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తియిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు స్టేట్ కమిటీ నియమించాలన్న అంశంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం చేశామని నేతలు వివరించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం
రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టివ్ గా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నాయకులు వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యం అయ్యేటట్లు అయితే.. ఈ లోపు ముఖ్య నాయకులతో కలిపి రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు.. కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ యాక్టివిటీ పెంచాలని సూచించారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చేవారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి మండల, అసెంబ్లీ నియోజకవర్గ, పార్లమెంట్ నియోజకవర్గ, జిల్లా కమిటీలు పూర్తిచేయాలని అన్నారు.
Also Read: Tejaswini debut: కెమెరా ముందుకు బాలయ్య బాబు చిన్న కూతురు.. అందుకేనా?
ఎన్నికలపై మరోసారి భేటి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి నేతలు మొగ్గుచూపుతున్నారు. సుహాసినీ, అరవింద్ కుమార్ గౌడ్ ఆసక్తిచూపారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం పోటీచేయడం లేదని సూచించినట్లు సమాచారం. పార్టీ మద్దతు ఇవ్వాలని బీజే(BJP)పీ కోరితే ఇద్దమని, మనమంతటా మనం వెళ్ళొద్దని సూచించినట్లు సమాచారం. ఒకటి రెండ్రోజుల్లో బీజేపీ(BJP) అభ్యర్థిపై క్లారిటీ వస్తుందని వెయిట్ చేద్దామని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ఏపీ(AP)లో బీజేపీతో కలిసి పోతున్నామని, అందుకే మనం తొందరపడొద్దని సూచించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై మరోసారి భేటి కానున్నట్లు సమాచారం. పార్టీ బలంగా ఉన్న మండలాలు, గ్రామాల వివరాలు సేకరించాలని, అక్కడ పోటీచేద్దామని చెప్పినట్లు సమాచారం. అప్పటివరకు క్షేత్రస్థాయి వరకు కమిటీలు వేయాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు రవింద్ కుమార్ గౌడ్(Ravindhar Goud), బక్కని నర్సింహులు, నాయకులు కంభంపాటి రాంమ్మోహన్, సుహాసిని, నన్నూరి నర్సిరెడ్డి, హరి, ఆనంద్, పొగాకు జయరాం, సామ తదితరులు పాల్గొన్నారు.
Also Read: KTR: ప్రజలకు కాంగ్రెస్ మోసం అర్థమైంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
