Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో మరోసారి డొల్లతనం బయటపడింది. గతంలో పెచ్చులు ఊడిపడిన ఘటన వెలుగుచూడగా, తాజాగా ఇంటర్ నెట్(Internet) సేవలకు అంతరాయం కలిగింది. ఫోర్త్ ప్లోర్‌లోని ఓ బ్లాక్‌లో ఇంటర్ నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షం కారణంగా పైపుల్లో లీకేజ్ కాగా, కేబుల్స్ దెబ్బతిన్నట్టు సెక్రటేరియట్ స్టాఫ్ చెబుతున్నారు. ఇప్పటికీ పైపుల్లో నీరు(Water) ఉన్నట్టు వివరించారు. మంత్రి కొండా సురేఖ(Minester Konda Sureka) పేషీలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. వర్షం నీటితో విద్యుత్ వైర్లు, ప్రింటర్లు(Printers), ఇంటర్ నెట్(Internet) సేవలకు అంతరాయం కలిగింది. నెట్ ఆగిపోవడంతో ఫైల్స్ అప్లోడ్‌కు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని ప్లోర్లలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు సచివాలయ ఉద్యోగులు వివరించారు.
గతంలో ఊడిపడిన పెచ్చులు
ఈ ఏడాది ఫిబ్రవరి(FEB)లో కూడ సచివాలయంలో డొల్లతనం బయటపడింది. భవనం పై పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కారు పాక్షికంగా ధ్వంసమైంది. భవనం దక్షిణ వైపు ఆరో అంతస్తు నుంచి ఈ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ శబ్దానికి ఉద్యోగులందరూ ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు పైపుల్లోకి వర్షపు నీరు చేరి కేబుల్స్ దెబ్బతిని ఇంటర్ నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. బీఆర్ఎస్(BRS) హయాంలో ప్రతిష్టాత్మకంగా వందల కోట్లతో నిర్మించిన సచివాలయంలో వరుస సంఘటనలు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Telangana Govt: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్
