Kaleshwaram Project (imagecredit:twitter)
తెలంగాణ

Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్​ పిటిషన్లపై విచారణ వాయిదా..!

Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్​ నివేదికపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయటానికి సమయం కావాలని ప్రభుత్వం కోరటంతో తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. బీఆర్​ఎస్(BRS)​ ప్రభుత్వం ఘనంగా చెప్పుకొని లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ పీ.సీ.ఘోష్(Justice P.C. Ghosh)​ నేతృత్వంలో విచారణ కమిషన్​ నియమించింది.

అప్పటి ప్రభుత్వం..

మాజీ సీఎం కేసీఆర్(KCR)​, మాజీ మంత్రులు హరీష్​ రావు(Harish Rao), ఈటెల రాజేందర్​(Etela Rajender) తోపాటు నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ఇంజనీర్లు, ప్రాజెక్టులో కీలకపాత్ర వహించిన అధికారుల నుంచి కమిషన్ లిఖితపూర్వకంగా వివరాలు సేకరించింది. అనంతరం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీంట్లో అప్పటి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం, నాణ్యత గురించి పట్టించుకోక పోవటం, డిజైనింగ్ లోపాల వల్లనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయినట్టుగా పేర్కొంది. బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసింది. అయితే, కమిషన్​ ఆఫ్​ ఎంక్వయిరీస్​ యాక్ట్ ప్రకారం తమకు నోటీసులు ఇవ్వకుండానే కమిషన్​ నివేదిక ఇచ్చిందని పేర్కొంటూ మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రి హరీష్​ రావులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Also Read: Wife Suicide: మటన్‌లో కారం లేదని తిట్టిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

విచారణను వచ్చే నెల..

కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరారు. ఆ తరువాత ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్(Smitha Sabarvall) కూడా కాళేశ్వరం రిపోర్టును క్వాష్ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు. వీటిపై మంగళవారం హైకోర్టు(Highcort) విచారణ చేపట్టింది. అయితే, కౌంటర్ దాఖలు చేయటానికి ప్రభుత్వం గడువు కోరటంతో విచారణను వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత రిప్లయ్​ కౌంటర్లు దాఖలు చేయాలని మాజీ సీఎం కేసీఆర్(KCR)​, మాజీ మంత్రి హరీష్​ రావు, స్మితా సబర్వాల్ లకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు ఇంతకు ముందు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది.

Also Read: Bunny Vasu: ప్రసాద్ బెహరాపై అసంతృప్తి వ్యక్తం చేసిన బన్నీ వాస్.. ఎందుకంటే?

Just In

01

Jubilee Hills By-Election: చిన్న శ్రీశైలం యాదవ్ బైండోవర్.. మరో 100 మందికి పైగా రౌడీషీటర్లు కూడా!

Kurnool Bus Accident: కర్నూలు జిల్లా‌ బస్ యాక్సిడెంట్ మృతులైన తల్లికూతుర్లకు కన్నీటి వీడ్కోలు

Medak: ప్రభుత్వ పాఠశాలకు నీటి శుద్ధి యంత్రాన్ని అందజేసిన హెడ్ మాస్టర్.. ఎక్కడంటే?

Ramchander Rao: రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయింది.. రౌడీ షీటర్లపై కేసుల ఎత్తేసి ఫించన్లు కూడా ఇస్తారు

Mass Jathara Trailer: మాస్ విందుకు రెడీ అయిపోండమ్మా.. ఇక వార్ జోనే!