cm photo dispute
Politics

MLC: ఫొటోల లొల్లి.. బీఆర్ఎస్ ఆరోపణకు కాంగ్రెస్ దిమ్మదిరిగే కౌంటర్

Chairman Chamber: ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీల మధ్య ఫొటోల లొల్లి జరిగింది. శాసన మండలి చైర్మన్ చాంబర్‌లో మహనీయుల సరసన సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టడం ఏమిటీ? అంటూ బీఆర్ఎస్ ప్రశ్నించింది. అందుకు ప్రూఫ్‌గా ఫొటోనూ జత చేసి ట్విట్టర్‌లో బాల్క సుమన్ పోస్టు పెట్టారు. దీనికి కాంగ్రెస్ పార్టీ అంతే స్పీడ్‌గా దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఫొటో కూడా అక్కడే ఉండేదని వివరిస్తూ.. ప్రూఫ్‌గా పాత ఫొటోను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ట్వీట్ చేశారు. దీంతో బాల్క సుమన్ ఎరక్కపోయి ఇరుక్కుపోయాడని కామెంట్లు వస్తున్నాయి.

ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తరుణంలో శాసనమండలి చాంబర్ ఫొటోలు బయటికి వచ్చాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శాసన మండలి చాంబర్‌ ఫొటోనూ ట్వీట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు. మహనీయుల సరసన సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టడం వారిని అవమానించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. శాసన మండలి చాంబర్‌లో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రముఖ సామాజికవేత్త మహాత్మా జోతిరావు గోవిందరావు ఫూలే చిత్రపటాల సరసన సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను పెట్టారని, ఈ పరిణామాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారని ట్వీట్ చేశారు.

వెంటనే ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఫొటో అక్కడే ఉండేదని, అదే ప్లేస్‌లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టారని వివరించారు. అప్పుడు మహనీయుల సరసన కేసీఆర్ ఫొటో ఉన్నప్పుడు కళ్లు మూసుకుపోయాయా? అంటూ బాల్క సుమన్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రతిదానికి అనవసరపు రాద్ధాంతం ఎందుకంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నాయకులు పద్ధతి మార్చుకోకపోతే ఎవరూ ఏం చేయలేరని సెటైర్ వేశారు. ‘మిమ్మల్ని మీరే బొద పెట్టుకుంటామని ఎవరు వద్దంటారు’ అంటూ సెటైర్ వేశారు. తెలంగాణకు పట్టిన భ్రష్టు వదులుతుందంటే ప్రజానీకానికి అంతకు మించి ఏం కావాలని చురకలంటించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!