Tummala Nageswara Rao: టోల్ ఫ్రీ నంబర్ గూర్చి కూడా విస్తృత ప్రచారం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని జిన్నింగ్ మిల్లర్లను, సీసీఐ(CCI)ని ఆదేశించారు. సచివాలయంలో సోమవారం పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. సీసీఐ టెండర్లలో విధించిన నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్ల అభ్యంతరాలను అధికారులతో చర్చించారు. సీసీఐ విడుదల చేసిన టెండర్ లో లింట్ శాతం ఎల్-1, ఎల్-2 అలాట్మెంట్ స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ కు ఉన్న నిబంధనలపైనా చర్చించారు.
మిల్లర్లు కూడా నష్టపోకుండా..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లర్లు(Ginning millers) వెంటనే టెండర్లలో పాల్గొని ఎలాంటి జాప్యం లేకుండా పత్తి కొనుగోళ్లు ను ప్రారంభించాలని ఆదేశించారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సీపీఐ(CPI) అధికారులను, జిన్నింగ్ మిల్లర్లను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలిగే చర్యలు ఎవ్వరూ చేపట్టిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీసీఐ ఈ సంవత్సరం పత్తి కొనుగోళ్లలో కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు ప్రతి వారం సమీక్ష నిర్వహించుకొని జిన్నింగ్ మిల్లర్లు కూడా నష్టపోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో షాకింగ్ ఘటన.. సీజేఐ గవాయ్‌పైకి బూటు విసరబోయిన లాయర్
రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లర్లు..
జిన్నింగ్ మిల్లుల పరిశ్రమకు సంబంధించిన కొత్త మార్గదర్శకాల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని పరిష్కరించడానికి స్వతంత్ర ఏజెన్సీ ద్వారా సమస్యలను పరిశీలించి ధృవీకరించుకొని ఎప్పటికప్పుడు తగిన నిర్ణయం తీసుకోవాలని సీసీఐ అధికారులు చూడాలన్నారు. రైతుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లర్లు వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. సీపీఐ కొనుగోళ్ల కు వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాల పరిరక్షణ కు ఎంత దూరమైనా వెళుతుందన్నారు. సీసీఐ, జిన్నింగ్ మిల్లర్లు కొనుగోళ్లకు సంబంధించి అన్ని ప్రక్రియలు వెంటనే పూర్తి చేసి రానున్న వారం రోజుల్లో రైతుల నుంచి పత్తి సేకరిస్తామని తెలిపారు.
యాప్ పై విస్తృత అవగాహన..
వ్యవసాయ శాఖ ఈ లోపు మొబైల్ యాప్(Mobile App), స్లాట్ బుకింగ్ యాప్(Slate Biking App) పై విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే మండలాల వారీగా రైతు వేదికల ద్వారా ఈ యాప్ గురించి స్లాట్ బుకింగ్ గురించి అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు సీసీఐ(CCI) తో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, సీపీఐ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తా, టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ పూర్ణేష్ గురునాని, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మి భాయి, అధికారులు పాల్గొన్నారు.
Also Read: Rajasthan News: ఆస్పత్రిలో ఘోరం.. ఐసీయూలో చెలరేగిన మంటలు..ఆహుతైన అగ్నికి పేషెంట్లు
