Hydraa: గ్రేటర్ సిటీ పరిధిలోని ట్రై సిటీల్లో సర్కారు భూముల(Government lands)ను పరిరక్షించటంతో పాటు బతుకమ్మ కుంట(Bathukamma Kunta)ను పునరుద్దరించి, పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన హైడ్రా(Hydra) పని తీరు పట్ల హైకోర్టు అభినందనలు తెలిజేసింది. నగరంలో చెరువుల అభివృద్ధిని ఓ యజ్ఞంలా చేస్తోందని హై కోర్టు(High Cort) సోమవారం కితాబిచ్చింది. అందుకు నగరంలో పునరుద్దరణ, అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్యమని పేర్కొంది. ముఖ్యంగా బతుకమ్మకుంట అభివృద్ధిని చూస్తే ముచ్చటేస్తోందని వ్యాఖ్యానించింది. ఆక్రమణలకు గురై చెత్తకుప్పలా, పిచ్చిమొక్కలతో అటువైపు చూడాలంటే భయంగా ఉన్న ప్రాంతాన్ని చెరువుగా అభివృద్ధి చేసిన హైడ్రా తీరు హర్షణీయమని పేర్కొంది.
గచ్చిబౌలిలోని మల్కం చెరువు
టీడీఆర్(TDR) కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీధర్(S Srider) సైతం హైడ్రా(Hydra)ను అభినందిస్తూ జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి(Justice Vijaysen Reddy) చేసిన వ్యాఖ్యలపై ఏకీభవించారు. బతుకమ్మకుంట సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆ పరిసర ప్రాంతాలకు వరద ముప్పు తప్పించడమే గాకా, భూగర్భ జలాలను కూడా పెంచిందని, గచ్చిబౌలిలోని మల్కం చెరువును చూస్తే ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని జస్టిస్ వ్యాఖ్యానించారు. చెరువుల ఎఫ్‌టీఎల్(FTL), బఫర్ జోన్ల పరిధిలో ఎవరివైనా ఇంటి స్థలాలు, భూములు ఉంటే టీడీఆర్ (ట్రాన్సఫర్ డెవలప్‌మెంట్ రైట్స్) కింద వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వం ఇందుకోసం సరైన విధానాన్ని తీసుకురావాలని సూచించారు.
Also Read: GHMC: ట్యాక్స్ కట్టని భవనాలపై బల్దియా ఫోకస్.. త్వరలో వారికి నోటీసులు
మాధాపూర్‌లోని తమ్మిడికుంట
మాధాపూర్(Madhapur)లోని తమ్మిడికుంట(Thamidi Kunta) చెరువు పరిధిలోని రెండు ఎకరాలకు సంబంధించిన టీడీఆర్(DTR) కేసు విచారణలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి హైడ్రా(Hydra)ను ప్రశంసించే వ్యాఖ్యలు చేశారు. టీడీఆర్ విషయంలో ప్రభుత్వం సరైన విధానాన్ని పాటిస్తే, చెరువుల అభివృద్ధికి ఆటంకం ఏర్పడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ్మిడికుంటలో భూములు కోల్పోయిన వారికి సరైన టీడీఆర్ ఇవ్వాలని సీనియర్ న్యాయవాది శ్రీధర్ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.
Also Read: Illegal Ventures: రావిరాల చెరువులో భారీగా వెంచర్లు.. ఎక్కడికక్కడ నిబంధనల ఉల్లంఘనలు
