Vijay Deverakonda car Accident
ఎంటర్‌టైన్మెంట్

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కారుకు యాక్సిడెంట్.. అసలేం జరిగిందంటే?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రయాణిస్తున్న కారుకు పెను ప్రమాదం తప్పింది. దసరా స్పెషల్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో నిశ్చితార్థం అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్‌ పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడానికి తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్‌ దేవరకొండతో కలిసి వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన వారు శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంలోని పుట్టపర్తికి వెళ్లారు. దర్శనం అనంతరం సోమవారం వారు పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరగా.. ఆలంపూర్ చౌరస్తాకు సమీపంలోని 44వ జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తుండగా ఉండవెల్లి వరసిద్ధి వినాయక పత్తి మిల్లు సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. నందికొట్కూరు నుంచి పెబ్బేరుకు పశువులను తీసుకువెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో బొలెరో వాహనాన్ని విజయ్ దేవరకొండ వాహనం ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం ప్రమాదం చోటు చేసుకోలేదు. కేవలం కారుకు సైడ్ భాగంలో పాక్షికంగా దెబ్బతింది. డ్రైవర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఉండవల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read- Rashmika Mandanna: ‘ఇదంతా మీ కష్టంతోనే సాధ్యమైంది’.. రష్మిక పోస్ట్ వైరల్!

ప్రమాదం ఎలా జరిగింది?

విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న లెక్సస్ (Lexus) మోడల్ కారు గద్వాల జిల్లాలోని ఉండవల్లి ప్రాంతానికి చేరుకోగానే, ముందు వెళ్తున్న ఒక బొలెరో (Bolero) వాహనం ఉన్నట్టుండి ఎటువంటి సూచనా లేకుండా కుడివైపు టర్న్ తీసుకుంది. అసలు ఊహించని ఈ పరిణామంతో, వెనుక వేగంగా వస్తున్న విజయ్ దేవరకొండ కారు డ్రైవర్ దానిని తప్పించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో, లెక్సస్ కారు బలంగా బొలెరోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఢీకొనడంతో రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే విజయ్ దేవరకొండ, ఆయన కుటుంబ సభ్యులు కారు దిగి, అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. కారు డ్రైవర్లు, ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత, మరో వాహనంలో వారు హైదరాబాద్‌కు బయలుదేరారు.

Vijay Car

Also Read- Bigg Boss Telugu 9: డే 29 నామినేషన్స్ ట్విస్ట్ అదిరింది.. ఇమ్యూనిటీ టాస్క్‌లో రేలంగి మావయ్య!

క్షేమంగా బయటపడిన హీరో అండ్ ఫ్యామిలీ

ఈ ప్రమాదం తీవ్రత తక్కువగా ఉండటంతో విజయ్ దేవరకొండకు, ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే స్థానికులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తన కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ఏమీ కాకపోవడంతో విజయ్ దేవరకొండ, ఆయన కుటుంబ సభ్యులంతా ఊరట చెందారు. ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు ఆయన క్షేమం పట్ల సోషల్ మీడియాలో.. ‘జాగ్రత్త అన్నా’ అంటుంటే, మరికొందరు.. ‘అయ్యో.. నిశ్చితార్థం అయిన రెండు రోజులకే ఇలా జరిగిందేంటి? అని కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే, కొంతకాలంగా ప్రేమలో ఉన్న విజయ్, రష్మిక సడెన్‌గా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చారు. ఒక ప్రైవేట్ ఫంక్షన్‌గా ఈ వేడుకను వారు జరుపుకున్నారు. ఈ నిశ్చితార్థానికి సంబంధించి ఇంత వరకు అధికారికంగా వారు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఫిబ్రవరిలో విజయ్, రష్మికల పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుందనేలా టాక్ నడుస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!