AP cm chandrababu at tirupathi
Politics

Amaravathi:తిరుపతి నుంచే ప్రక్షాళన ప్రారంభం

Chandrababu Naidi at Tirupathi with family after beceme 4th time CM :
ఏపీలో ప్రజాపాలన మొదలయింది. ప్రక్షాళన ఇక తిరుమల నుంచే ప్రారంభం కావాలి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కుటుంబ సమేతంగా గురువారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుస్న చంద్రబాబు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘనవిజయం సాధించామని అన్నారు. ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలిపిరి వద్ద క్లైమోర్‌ మైన్స్‌ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని.. శ్రీ వేంకటేశ్వరస్వామే తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగుజాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తుంటానని తెలిపారు. కుటుంబ వ్యవస్థ మనకు పెద్ద సంపదని.. ఎనర్జీని రీఛార్జ్‌ చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పంచుకునే భాగస్వాములు ఉంటారని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు కుటుంబసభ్యులు అండగా నిలబడ్డారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

వెంకన్న ఆశీస్సులతో ఆర్థిక సంస్కరణలు

‘‘1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయినంత వరకు పాలన సచివాలయానికే పరిమితమై ఉండేది. ఆ తర్వాత ప్రక్షాళన చేశాం. సరికొత్త పాలన ప్రారంభించాం. వెంకన్న ఆశీస్సులతో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం. సంపద సృష్టించాలి.. దాన్ని పేదలకు పంచాలి. గత ఐదేళ్లు ప్రజలు భయపడిపోయారు. వారిపై అపారమైన గౌరవం ఉంది.. రుణపడి ఉన్నా. ఐదు కోట్ల మందికి ప్రతినిధిని. రాజకీయ పార్టీలు, నేతలు, మీడియా ప్రతినిధులు క్షోభ అనుభవించారు. పరదాలు, చెట్లు కొట్టడంలాంటివి ఇకపై ఉండవు. నేరస్థులను సహించేది లేదు. తిరుమలలో గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభ్యమయ్యేలా చేశారు. శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదు.

ప్రపంచ స్థాయిలో తిరుపతి వృద్ధి

ప్రజా పాలన ప్రారంభమైంది. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలి. ప్రసాదాలు, తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యం. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలూ మమేకం కావాలి. నష్టపోయిన, ఇబ్బంది పడిన వర్గాలను ఆదుకోవాలి. రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయి.. వాటిని పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. కక్ష సాధింపులు ఉండవు. తితిదేను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు అన్నారు.

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..