Huma Qureshi: సెలబ్రిటీలను ఫ్యాన్స్ ఎంతగా అభిమానిస్తారో అందరికీ తెలిసిందే. హీరో, హీరోయిన్లు బయట ఎక్కడ కనిపించినా వారితో ఫొటో దిగేందుకు ఫ్యాన్స్ తెగ ఎగబడిపోతుంటారు. మరోవైపు తారలు సైతం మీడియా, అభిమానులను ఆకట్టుకునేందుకు సరికొత్త కాస్ట్యూమ్స్ తో బయటకు వస్తుంటారు. తమ లుక్స్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి హుమా ఖురేషి.. ఒక సరికొత్త టీషర్ట్ ధరించి చిక్కులు కొని తెచ్చుకుంది.
చిరిగిన టీషర్ట్ ధరించి..
బాలీవుడ్ నటి హుమా ఖురేషి మోడ్రన్ డ్రెస్సులకు పెట్టింది పేరుగా నిలుస్తుంటారు. కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతూ.. నలుగురిలో ప్రత్యేకంగా నిలవడం ఆమె స్టైల్. ఈ క్రమంలోనే ఈసారి విచిత్రమైన టీషర్ట్ ధరించి.. ఆమె పెద్ద ఎత్తున ట్రోల్స్ కు గురవుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఆమె చినిగిన టీషర్టులో కనిపించారు. ముందు వైపు టీషర్ట్ డీసెంట్ లుక్ తో బానే ఉన్నప్పటికీ.. వెనక వైపున మాత్రం పూర్తిగా చిరిగిన స్థితిలో కనిపించింది. దీంతో ఆమెను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.
अभिनेत्री हुमा कुरैशी को हाल ही में एयरपोर्ट पर देखा गया, और उसका लुक सोशल मीडिया पर वायरल हो गया!
Balenciaga की 100% कॉटन वाली टी-शर्ट पहनी थी, जिसकी कीमत ₹65,000 है।
pic.twitter.com/4jGgF5Kagv— ममता राजगढ़ (@rajgarh_mamta1) September 25, 2025
టీషర్ట్ ధర.. రూ. 65 వేలు?
సాధారణంగా సెలబ్రిటీలు ఖరీదైన వస్త్రాలను ధరిస్తుంటారు. ఈ క్రమంలోనే హుమా ఖురేషీ ధరించిన టీషర్ట్ ధర గురించి సహజంగానే చర్చ మెుదలైంది. అయితే ఈ టీషర్ట్ విలువ దాదాపు రూ. 65 వేలని నెట్టింట చర్చ జరుగుతోంది. దీంతో ‘చిరిగిన టీషర్ట్ కు అంత ధర పెట్టావా మహా తల్లి? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే మంచి డ్రెస్ దొరకలేదా అని కామెంట్స్ రూపంలో నిలదీస్తున్నారు. మరికొందరు ‘కుక్కలు చింపిన విస్తరిలా ఉంది.. ఇదేం టీషర్ట్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
View this post on Instagram
ప్రియుడితో నిశ్చితార్థం
ఇటీవలే హుమా ఖురేషీ తన ప్రియుడు రచిత్ సింగ్ (Rachit Singh) తో సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. రచిత్.. ముంబయిలో యాక్టింగ్ స్కూల్ టీచర్ గా వ్యవహరిస్తున్నారు. వారిద్దరు గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంగేజ్ మెంట్ చేసుకున్న వార్తలు సైతం బయటకు వచ్చాయి.
Also Read: Hyderabad: ఓరి దేవుడా.. పెద్ద ప్రమాదమే తప్పింది.. లేదంటే మెుత్తం పోయేవారే!
ఫిల్మ్ నేపథ్యం..
హుమా ఖురేషి.. ఫిల్మ్ కెరీర్ కు వస్తే ఆమె ‘గ్యాంగ్స్ ఆఫ్ వసియాపుర్’ తో నటిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత హిందీలో త్రిష్ణా, ఏక్ తి దాయన్, షార్ట్స్, డి-డే, దేద్ ఇష్కియా, హైవే, జాలీ బీబీ 2, వైశ్రాయ్ హౌస్ వంటి చిత్రాల్లో చేశారు. ఈ ఏడాది వచ్చిన మాలిక్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి ఉర్రూతలూగించారు. అలాగే రీసెంట్ గా విడుదలైన ‘జాలీ ఎల్ఎల్‌బీ 3’ చిత్రంలోనూ కనిపించారు. తమిళంలో రజనీకాంత్ ‘కాలా’, అజిత్ నటించిన వెలిమై చిత్రాల్లోనూ ఆమె నటించారు.
