Adluri Laxman: జూబ్లీహిల్స్ లోని ముస్లీంలకు ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman)పేర్కొన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమం, అభివృద్ధిపై ఫోకస్ పెడతామన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లీంల గౌరవానికి కబ్రస్థాన్ కేటాయించామన్నారు. సీఎం రేవంత్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. పాత కబ్రస్థాన్‌ల అభివృద్ధికీ ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. లైటింగ్, డ్రైనేజీ, రోడ్లు, నీటి సదుపాయాల పనులు చేపడతామన్నారు. ఆక్రమణలు జరగకుండా బౌండరీ వాల్ నిర్మాణం చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక సమాధి భూమిని గుర్తించడమే లక్ష్యం అంటూ వెల్లడించారు.
బలహీన వర్గాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం, మైనారిటీల అభ్యున్నతి దిశగా స్పష్టమైన మార్గాన్ని అనుసరిస్తోందన్నారు. దేశంలో బలహీన వర్గాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని వెల్లడించారు. గత టీఆర్‌ఎస్ పాలనలో మైనారిటీల సమస్యలను నిర్లక్ష్యం చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకుందని మంత్రి అన్నారు.వక్ఫ్ స్థలాలు, కబ్రస్థాన్ భూముల రక్షణకు కలెక్టర్లతో సమన్వయం కొనసాగుతోందని వివరించారు.
మైనారిటీల విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మైనారిటీల విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. ప్రతి ముస్లీం మైనారిటీ విద్యార్థి కూడా ఉన్నత స్థాయిలో నిలవాలని కోరుకున్నారు. పేద, మధ్య తరగతి ముస్లీం కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య అందించే దిశగా ఎర్రగడ్డలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో ఈ అత్యాధునిక సదుపాయాలతో కాలేజీని ప్రారంభించామన్నారు. మైనార్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ద్వారా ఇతర ఉన్నత కాలేజీల సమాన స్థాయి పోటీ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.
Also Read: Sandhya Shantaram death: బాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత..
