RTC Fare Hike ( IMAGE CREDIT; SWETCHA REPORTER)
తెలంగాణ

RTC Fare Hike: ఆర్టీసీ ఛార్జీలపెంపుదలను వెంటనే విరమించుకోవాలి.. సీపీఎం నేత డిమాండ్

RTC Fare Hike: హైదరాబాదు-సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆర్టీసీ ఛార్జీలు మొదటి మూడు స్టేజీలకు రూ.5లు, నాలుగవ స్టేజీకి రూ.10ల చొప్పున పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కొత్త డిపోలు, కొత్త ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుకు రూ.392 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ ఛార్జీలను పెంచుతున్నట్లు, అందుకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

 Also Raed: Keesara: కీసరలో తమిళ తంబీల లొల్లి.. బైక్ పక్కకు తీయమన్నందుకు రచ్చ

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదులో ఎలక్ట్రికల్‌ బస్సు చార్జీలను, బస్సు పాస్‌ చార్జీలను భారీగా పెంచిందన్నారు. అలాగే పండగల పేరుతో ప్రజల నుండి 50 శాతం ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తూనే ఉన్నారన్నారు. మౌలిక సదుపాయాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా ప్రజలపై మరోసారి అదనంగా భారాలు వేయడం సమంజసం కాదన్నారు. ఆర్టీసీ కార్గో సర్వీసులను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయని, కార్గో సేవలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలను విరమించుకొని ఆర్టీసీలోనే కార్గోసేవలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోవాలనికోరారు.

Also Raed: Sasivadane: ఇందులో ఎటువంటి అశ్లీలత ఉండదు.. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు చూసుండరు

గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తున్నారు.. ఎమ్మెల్సీ కవిత

సామాన్య ప్రజలంటే ఎందుకింత కోపం ముఖ్యమంత్రి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ఆదివారం ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మొన్నటికి మొన్న సిటీ బస్ పాస్ ల ధరలు భారీగా పెంచి చిరుద్యోగులు, నగర ప్రజలపై పెనుభారం మోపారని మండిపడ్డారు. ఇప్పుడు బస్ చార్జీలను అమాంతం పెంచేశారు.. బస్సు ఎక్కడమే పాపం అన్నట్టుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని పేర్కొన్నారు.

 Also Read: Meenakshi Natarajan: ఓట్ చోర్‌పై సీరియస్‌నెస్ ఏది.. ఏఐసీసీ పిలుపును పట్టించుకోరా.. నేతలపై మీనాక్షి నటరాజన్ ఫైర్

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?