Mandaadi Accident
ఎంటర్‌టైన్మెంట్

Mandaadi: సుహాస్ ‘మందాడి’ మూవీ షూటింగ్‌లో ప్రమాదం.. భారీగా నష్టం!

Mandaadi: తెలుగు యువ నటుడు సుహాస్‌ (Suhas), తమిళ కమెడియన్ సూరి (Soori) కలిసి నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘మందాడి’ (Mandaadi) షూటింగ్‌లో పెద్ద ప్రమాదం సంభవించింది. చెన్నై సమీపంలోని సముద్ర తీరంలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ఉన్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ప్రమాదంలో సుమారు కోటి రూపాయల విలువైన కెమెరాలు, ఇతర షూటింగ్‌ సామగ్రి సముద్రంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై వార్తలు మొదలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read- Bigg Boss Elimination: బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేటైంది ఎవరో తెలుసా?

మొత్తంగా కోటి రూపాయల వరకు నష్టం

ఈ చిత్రం షూటింగ్ తమిళనాడులోని రామనాథపురం జిల్లా తొండి సముద్ర తీరంలో జరుగుతోంది. సముద్రంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించే క్రమంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. సమాచారం ప్రకారం, పడవ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ సమయంలో పడవలో ఉన్న ఇద్దరు సాంకేతిక నిపుణులు నీటిలో మునిగిపోగా, యూనిట్‌ సభ్యులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పి, ప్రాణ నష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. నీటిలో పడిపోయిన కెమెరాలు, ఇతర ఖరీదైన షూటింగ్‌ పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందులో ఒక్క కెమెరా విలువ సుమారు రూ. 60 లక్షల వరకు ఉంటుందని, మొత్తంగా కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read- Rahul Ramakrishna: నేనొక చిన్న నటుడ్ని.. నా బాధ్యత తెలుసుకున్నా.. ట్విట్టర్‌కు గుడ్ బై!

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ (Vetri Maaran) ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, మతిమారన్‌ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్‌లో సూరి హీరోగా, సుహాస్‌ విలన్‌గా నటిస్తున్నారు. అదే తెలుగు వెర్షన్‌లో సుహాస్‌ కథానాయకుడిగా, సూరి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ ప్రమాద సమయంలో హీరోలైన సూరి, సుహాస్‌ పడవలో లేరని తెలుస్తోంది. ఈ సంఘటనపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంభవించిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే మేకర్స్ షూటింగ్ ఆపేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ ప్రమాదంపై చిత్రయూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాల్సి ఉంది. సుహాస్ విషయానికి వస్తే.. మొదటి నుంచి సుహాస్ వైవిధ్యమైన పాత్రలనే ఎన్నుకుంటూ, నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన హిట్ అయితే పడలేదు. ఆయనకు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. మధ్యలో ‘ప్రసన్న వదనం’ సినిమా మాత్రమే కాస్త పరవాలేదని అనిపించుకుంది. అందుకే, ఈ సినిమాపై సుహాస్ భారీగా నమ్మకాన్ని పెట్టుకున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!