Kodanda Reddy ( IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ

Kodanda Reddy: సీసీఐ పత్తి కొనుగోళ్లు జరిగేలా చూడాలి.. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కీలక వ్యాఖ్యలు

Kodanda Reddy: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ ) ఉన్నతాధికారులతో పత్తి పంట కొనుగోళ్లపై ఫోన్ లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి (Kodanda Reddy) మాట్లాడారు. పత్తి సాగుచేసే రైతులు పత్తి పంట అమ్మకాల సమయంలో దళారుల చేతుల్లో మోసపోతున్నారని వివరించారు. తొందరపడి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవడం వల్ల నష్టపోతున్న విషయాలను సీసీఐ దృష్టికి తీసుకెళ్లారు. సీసీఐ కొనుగోళ్లలో కూడా కొందరు దళారులు ఇన్వాల్ అవుతున్న విషయాలను సైతం సీసీఐ ఉన్నతాధికారులకు వివరించారు. గతేడాది తెలంగాణలో పత్తి కొనుగోళ్లలో జరిగిన లోపాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు.

 Also Read:Hyderabad Crime: సొంత చెల్లెలిపై కక్ష.. మేనకోడల్ని చంపిన కిరాతకుడు.. వెలుగులోకి సంచలన నిజాలు

ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. పత్తి రైతులకు నష్టం జరగకుండా పత్తి కొనుగోళ్లు జరిగేలా చూడాలని సీసీఐ ని కోరారు. రైతులు తొందరపడి పత్తి పంటను ప్రైవేటు మార్కెట్ లో అమ్మొద్దని, ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) అధికారికంగా పత్తి కొనుగోలు చేస్తుందని, తేమ 12 శాతం వరకు అనుమతి ఉంటుందని, పత్తి పంట పొలాల నుంచి కొనుగోలు కేంద్రాలకు సంచులాల్లో కాకుండా ఓపెన్ గానే తీసుకురావాలని, ఈ నెల 6 న పత్తి కొనుగోలు ప్రతిష్టంభన విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సంబందిత అధికారులతో కేంద్ర కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) సమావేశం ఉంటుందని, వివరంగా పత్తి కొనుగోలు అంశం నిర్ణయం జరుగుతుందని వెల్లడించారు.

 Also Read: Sasivadane: ఇందులో ఎటువంటి అశ్లీలత ఉండదు.. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు చూసుండరు

కోల్డ్రిఫ్ సిరప్ వాడొద్దు.. బ్యాచ్ నెం. SR13 వాడకం నిలిపివేయాలి.. డీసీఏ హెచ్చరిక

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గు మందు సేవించి, చిన్నారులు మరణించడంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అనుమానిత కోల్డ్రిఫ్ సిరప్ బ్యాచ్ నెంబర్ SR13 వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని డీసీఏ సూచించింది. తమిళనాడులోని కంచిపురం జిల్లా సుంగువార్చతిరానికి చెందిన శ్రీసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్రిఫ్ సిరప్ (పారాసెటమాల్, ఫెనిలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్‌ఫెనిరమైన్ మలేట్ కాంబినేషన్) బ్యాచ్ నెంబర్ SR13, మానుఫాక్చరింగ్ తేది మే 2025, ఎక్స్పైరీ తేదీ ఏప్రిల్ 2027 విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్ (డీఈజీ)తో కలుషితమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఈ సిరప్ ​ను వాడొద్దని డీసీఏ స్పష్టం చేసింది.

ఈ బ్యాచ్ నెంబర్ గల సిరప్ ప్రజల వద్ద ఉన్నా, డీలర్ల వద్ద ఉన్నా, మెడికల్ షాపుల్లో ఉన్నా వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని డీసీఏ కోరింది. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ కు టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా సమాచారం అందించవచ్చని పేర్కొంది. ఈ మేరకు డీసీఏ డైరెక్టర్ జనరల్, ఐపీఎస్ షానవాజ్ ఖాసిం శనివారం ప్రకటన విడుదల చేశారు.

 Also  Read: Local Body Elections: స్థానిక అభ్యర్ధుల ఎంపికలో టీపీసీసీకి సవాల్.. రాహుల్ గాంధీ రూల్‌కు నై అంటున్న లీడర్లు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?