og-tickets( image :X)
ఎంటర్‌టైన్మెంట్

OG Ticket Price: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎందుకంటే?

OG Ticket Price: పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ (They Call Him OG)’ సినిమా భారీ హైప్‌తో విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే ప్రారంభంలోనే టికెట్ రేట్లు అధికంగా ఉండటంతో కొంత మంది మాత్రమే సినిమాను చూడగలిగారు. ఈ సినిమా చూడలేదని నిరాశలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు శుభవార్త వచ్చింది. పెంచిన ‘ఓజీ’ టికెట్ ధరల గడువు నిన్నటితో ముగిసింది. నేటి నుంచి ఓజీ సినిమా టికెట్ రేట్లు యధా విధిగా ఉండనున్నాయి. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడం 10 రోజులు మాత్రమే ఉండటంతో ఆ గడువు ముగిసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో నేటి నుంచి థియేటర్లలో సాధారణ రేట్లకే టికెట్లు విక్రయాలు జరగనున్నాయి. ఈ నిర్ణయంతో మధ్యతరగతి పవన్ కళ్యాణ్ అభిమానులు మళ్లీ థియేటర్ల వైపు మళ్లుతున్నారు.

Read also-Local Body Elections: స్థానిక అభ్యర్ధుల ఎంపికలో టీపీసీసీకి సవాల్.. రాహుల్ గాంధీ రూల్‌కు నై అంటున్న లీడర్లు

పది రోజుల్లో వసూళ్ల
విడుదలైన పది రోజులు దాటినా ‘ఓజీ ’సినిమా బాక్సాఫీస్ వద్ద బలంగా నిలుస్తోంది. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. పవన్ కల్యాణ్ నటించిన ‘OG’ సినిమా బాక్సాఫీస్‌పై తుఫాను రేపుతూ, సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదలైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మొదటి రోజు భారత్‌లో రూ.63.75 కోట్ల నెట్ కలెక్షన్‌తో రికార్డు సృష్టించి, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రూ.63 కోట్లు వసూలు చేసింది, మొదటి వీక్‌లో మొత్తం రూ.169.3 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.164.75 కోట్లు సాధించింది. సుజీత్ డైరెక్షన్‌లో ‘ముంబై ఫైర్‌స్టార్మ్’ ట్యాగ్‌లైన్‌తో ముంబై క్రైమ్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ డ్రామాలో పవన్ శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, ఎమ్రాన్ హాష్మీ పాత్రలు, తమన్ స్కోర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని, రెండో వీక్‌లో కొంచెం తగ్గుదలపటికీ 9వ రోజు రూ.4.75 కోట్లు, 10వ రోజు రూ.5 కోట్లు వసూలు చేసి మొత్తం 10 రోజుల్లో భారత్‌లో రూ.179.05 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు పైగా కలెక్ట్ చేసి భారీ విజయాన్ని సాధించింది.

Read also-Damodar Rajanarsimha: స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం టాప్ గేర్: మంత్రి దామోదర రాజనర్సింహ

పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టైల్, థమన్ సంగీతం, సుజీత్ మాస్ ప్రెజెంటేషన్ కలిసి ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. సోషల్ మీడియాలో పాజిటివ్ మౌత్‌టాక్ కొనసాగుతుండటంతో సినిమా ఇంకా వసూళ్లలో దూసుకుపోతోంది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, వచ్చే రోజుల్లో కూడా ఈ సినిమా స్థిరంగా కొనసాగితే రూ.250 కోట్ల క్లబ్ చేరే అవకాశముందని చెబుతున్నారు. టికెట్ రేట్ల తగ్గుదలతో ‘ఓజీ’ మరోసారి చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. పవన్ కల్యాణ్ నటించిన ‘ది కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా, సుజీత్ డైరెక్షన్‌లో రూపొందిన యాక్షన్-గ్యాంగ్‌స్టర్ డ్రామా. సెప్టెంబర్ 25, 2025న విడుదలై, మొదటి రోజు రూ.154 కోట్లు గ్రాస్ వసూలు చేసి 2025లో అతిపెద్ద తెలుగు ఓపెనర్‌గా నిలిచింది. కథలో ఓజస్ గంభీర్ (పవన్ కల్యాణ్) తన సత్య దాదా (ప్రకాశ్ రాజ్) మార్గదర్శకత్వంలో కుటుంబ గ్యాంగ్‌స్టర్ వ్యాపారాన్ని నడుపుతాడు. ఒక దారుణ సంఘటన తర్వాత 20 సంవత్సరాలు అదృశ్యుడవుతాడు. తిరిగి వచ్చిన ఓజీ, ప్రతీకారం తీర్చుకోవడానికి రూత్‌లెస్‌గా మారి, ఇమ్రాన్ హాష్మీ (విలన్), ప్రియాంక అరుల్ మోహన్ (ఫీమేల్ లీడ్), శ్రీయ రెడ్డి మొదలైనవారితో కలిసి యాక్షన్, ఎమోషన్స్, ట్విస్ట్‌లతో కూడిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!