80s Reunion Party: ‘80స్ రీ-యూనియన్ పార్టీ’కి చిరు, వెంకీ!
Chiru and Venki
ఎంటర్‌టైన్‌మెంట్

80s Reunion Party: ‘80స్ రీ-యూనియన్ పార్టీ’కి ఒకే ఫ్లైట్‌లో చిరు, వెంకీ.. ఫొటో వైరల్!

80s Reunion Party: టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి (Megastar Chiranjeevi), వెంకటేష్ (Victory Venkatesh) కలిసి ఫ్లైట్‌లో చెన్నైకు పయనిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరూ చెన్నైలో శనివారం సాయంత్రం జరగనున్న ‘80స్ రీ-యూనియన్ పార్టీ’ (80’s Reunion Party) కోసం వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాది దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ తారలు ఒకచోట చేరి ఈ రీ-యూనియన్ పార్టీని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఈ వేడుకను చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, టాలీవుడ్‌కు చెందిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్లైట్‌లో చెన్నైకు వెళ్లారు. ఫ్లైట్‌లో పక్కపక్కనే కూర్చున్న తీరు.. వారి స్నేహబంధాన్ని తెలియజేస్తుంది. వైరల్ అవుతున్న ఫోటోలో చిరంజీవి, వెంకటేష్ చాలా సాధారణమైన, సౌకర్యవంతమైన దుస్తుల్లో కనిపించారు. వెంకటేష్ నవ్వుతూ పలకరిస్తుండగా, చిరంజీవి చిరునవ్వుతో ఉన్న ఈ ఫోటో అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Also Read- OG Movie: ‘ఓజీ’ మూవీ నేహా శెట్టి సాంగ్ వచ్చేసింది.. ఈ పాటను ఎలా మిస్ చేశారయ్యా?

పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ..

ఇద్దరు అగ్రశ్రేణి నటులు, అది కూడా అత్యంత సన్నిహిత మిత్రులు ఒకే విమానంలో కలిసి ప్రయాణించడం, ఆ ప్రయాణంలో సరదాగా ఇలా ఫొటోలు తీసుకోవడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ రీ-యూనియన్ పార్టీకి కేవలం చిరంజీవి, వెంకటేష్ మాత్రమే కాక.. అప్పటితరం నటీనటులు రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్, నదియా, రాధిక, శోభన, సుహాసిని మణిరత్నం వంటి వారంతా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ వేడుకను ప్రతి సంవత్సరం మిస్ కాకుండా జరుపుతున్నారు. ఈ పార్టీలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, సరదా ఆటపాటలతో వీరంతా సందడి చేయనున్నారు.

Also Read- Gill – Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. వన్డే కెప్టెన్‌గా శుభమన్ గిల్.. బీసీసీఐ అధికారిక ప్రకటన

ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవం

గతంలో ఈ పార్టీలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో జరిగాయి. ప్రతి రీ-యూనియన్‌కు ఒక ప్రత్యేకమైన థీమ్ ఉంటుంది. ఈసారి చెన్నైలో జరగనున్న ఈ పార్టీకి చిరంజీవి, వెంకటేష్ కలిసి వెళ్లడం, వీరి స్నేహానికి ప్రతీకగా నిలవడంతో పాటు, ఈ పార్టీపై సినీ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈ వార్షిక వేడుకలో తీసిన గ్రూప్ ఫోటోల కోసం సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా సినిమాల షూటింగ్‌లతో తీరిక లేకుండా ఉండే అగ్ర నటులు, నటీమణులు ఇలా ప్రతి ఏటా ఒకచోట కలవడం అనేది సినీ పరిశ్రమలోని వారి మధ్య ఉన్న బలమైన స్నేహబంధాన్ని, ప్రేమాభిమానాలను తెలియజేస్తుంది. పోటీ ఎంత ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో వీరు ఒకరికొకరు ఇచ్చే గౌరవం, స్నేహానికి ఈ ‘80స్ రీ-యూనియన్’ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం ఈ రీ యూనియన్ వేడుకను ఎవరు స్పాన్సర్స్ చేస్తున్నారనే వివరాలతో పాటు, వేడుకకు సంబంధించిన ఫొటోల కోసం సోషల్ మీడియా వేచి చూస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..