Bigg Boss Telugu 9: బిగ్ బాస్ డే 27 ప్రోమో.. బిర్యానీ హీట్
Bigg Boss Telugu 9
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ డే 27 ప్రోమో.. బిర్యానీ హీట్ మాములుగా లేదుగా!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) నాల్గవ వారం వీకెండ్‌కు చేరుకుంది. ఈ శనివారం జరిగే ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ ప్రోమోను వదిలారు. బిగ్ బాస్ హౌస్‌లో 27వ రోజు జరిగిన ఎపిసోడ్‌కు సంబంధించి ‘వీకెండ్ మస్తీ’ (Weekend Masti) అనే ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ వదిలిన ప్రోమోలో ఫన్, ఫైర్ కనిపిస్తోంది. శనివారం, ఆదివారం వస్తే.. హౌస్‌లో జరిగిన ప్రధాన సంఘటనలు, గొడవలు, టాస్క్‌లలో కంటెస్టెంట్ల వ్యూహాలు మొదలైన అంశాలపై నాగార్జున (King Nagarjuna) తన అభిప్రాయాలను సూటిగా చెబుతూ, ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తారు. అంతేనా, హౌస్‌మేట్స్‌కు కొన్ని ఫన్నీ టాస్క్‌లు ఇవ్వడం, లేదా వారి వారపు ప్రదర్శనను రేటింగ్ చేయమని చెప్పడం లాంటివి ఈ ఎపిసోడ్‌లో భాగమవుతాయనే విషయం తెలియంది కాదు. వీటన్నింటికి మించి.. వీకెండ్ వచ్చిందంటే.. హౌస్‌లో నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు, ఎలిమినేట్ అవుతారనే ఆసక్తితో కూడా శని, ఆదివారం ఈ షోని చూస్తుంటారు. ఇక ఈ శనివారానికి సంబంధించి వచ్చిన ప్రోమోలో.. (Bigg Boss Day 27 Promo)

Also Read- Gill – Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. వన్డే కెప్టెన్‌గా శుభమన్ గిల్.. బీసీసీఐ అధికారిక ప్రకటన

గొడవలు బాగా ముదిరిపోయాయ్

డే 27 ప్రోమో.. ఎలిమినేషన్ ప్రక్రియకు ముందు హౌస్‌లో నెలకొనే ఉల్లాసభరితమైన, ఉత్కంఠతతో కూడిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు వారం రోజులుగా సాగిన పోరాటాల నుంచి కాస్త ఉపశమనం, నాగార్జున నుంచి కొన్ని పదునైన వ్యాఖ్యలు, నవ్వు తెప్పించే ఆటలు, ముఖ్యంగా ఎలిమినేషన్‌పై సస్పెన్స్‌ను అందిస్తుంది. ఈ ప్రోమోలో అంత సస్పెన్స్ అయితే ఏమీ లేదు కానీ, పెద్ద యుద్ధం అయితే జరిగినట్లుగా చూపించారు. అందులోనూ ఇప్పటి వరకు ఒకరంటే ఒకరు బాగా అప్యాయంగా ఉండే సంజన, భరణిల మధ్య ఆసక్తికరమైన వార్ నడిచినట్లుగా తెలియజేస్తుంది. ముందు హోస్ట్ నాగార్జున ఎంట్రీతోనే.. గొడవలు బాగా ముదిరిపోయాయ్.. మనం మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయ్.. ఆలస్యంగా చేయకుండా హౌస్‌లోకి వెళ్లిపోదామని అనగానే.. బిగ్ బాస్ పంపిన సందేశాన్ని హరీష్ చదువుతున్నారు.

Also Read- Vijay Rashmika: సన్నిహితుల మధ్య సీక్రెట్‌గా రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం

గరం గరంగా బిర్యానీ టాస్క్..

‘థమ్సప్ అన్‌లాక్ ది తుఫానీ ఫర్ బిర్యానీ’ టాస్క్‌ని ఇచ్చిన బిగ్ బాస్ స్విమ్మింగ్ పూల్‌లో తుఫానీకి సంబంధించిన అక్షరాలను తీసుకొచ్చి క్రమంలో పేర్చాలని రెండు గ్రూపులను ఆదేశించారు. దివ్య, కళ్యాణ్ స్విమ్మింగ్ పూల్‌లో దిగి అక్షరాలను వెతికారు. ఫైనల్‌గా దివ్య టీమ్ గెలిచినట్లుగా చూపించారు. ఆ టీమ్‌కు బిర్యానీ పంపించారు. ఆ బిర్యానీ తినే క్రమంలోనే సంజనకు, భరణికి మధ్య పెద్ద వార్ జరిగింది. ఇద్దరూ మాటలు తూలుతున్నారు. సెల్ఫీష్ అన్నందుకు భరణి, షేమ్‌లెస్ అన్నందుకు సంజన హర్ట్ అయ్యారు. వారిద్దరి మధ్య జరిగిన వార్‌తో హౌస్ ఒక్కసారిగా వేడెక్కింది. సంజన ఎమోషనల్ అవుతున్నట్లుగా చూపించారు. పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిల్ చేయాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..