the-rajasab (image :x)
ఎంటర్‌టైన్మెంట్

The Raja Saab: ‘ది రాజా సాబ్’ నుంచి మరో అప్డేట్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

The Raja Saab: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పాడు దర్శకుడు మారుతి. ‘ది రాజా సాబ్’ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన అభిమానులు సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయని అనుకుంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మూవీ టీం బిజీ బిజీ గా గడుపుతోంది. తాజాగా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు మారుతి పోస్ట్ పెట్టడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారికి ఇది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూసిన అభిమానులు సినిమాపై అంచనాలు మరింత పెంచుకున్నారు. అయితే కొందరు దర్శకుడు మారుతీకి గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్నారు. గతంలో డబ్బింగ్ విషయంలో హిందీ, తమిళ అభిమానులు నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారైనా డబ్బింగ్ సరిగ్గా చెప్పించండి అంటూ దర్శకుడికి సూచనలు ఇస్తున్నారు. ఈ సారి అయినా అలాంటివి జరగకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటాడో లేదు చూడాలి మారి.

Read also-Akhanda 2 business: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ ఎమోషన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రచయిత, దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమాను తెరకెక్కించారు. ప్రభాస్ తో పాటుగా.. సంజయ్ దత్త్, నిధి అగర్వాల్, మాలవికా మోహన్ వంటి తారలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారర్-కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. జనవరి 9, 2026న ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు నిర్మాతలు.

Read also-Local Body Elections: గ్రామాల్లో ఊపందుకున్న స్థానిక ఎన్నికలు.. మద్దతు ఇస్తే మాకేంటి అంటున్న వర్గాలు

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ను చూస్తుంటే.. ప్రభాస్ కామెడీ టైమింగ్స్ బాగా కుదిరినట్లు ఉన్నాయి. సైకలాజికల్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంది. ఇందులో హీరో ఏదోటి చేసి బాగా హైప్ సాధించాలని చూసే సామాన్యమైన పాత్రలో కనిపిస్తారు. అదే క్రమంలో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే వ్యక్తిగా ఉండనున్నాడు. ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నారు. రెండో క్యారక్టర్ విలన్ గా ఉంటుంది. మొదటి సారి ప్రభాస్ రెండు పాత్రల్లోనూ ప్రభాస్ సమర్థవంతంగా కనిపించడం. హర్రర్ జోనర్ లో ప్రభాస్ కామెడీ టైమింగ్స్ అందరినీ అలరించాయి. సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. థమన్ సంగీతం అందరినీ భయపెట్టేలా ఉంది. ఓవరాల్ గా ఈ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్ కి ఫుల్ మీల్ లా అనిపిస్తుంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!