Tollywood Actor: ‘ఈ సినిమా 2025లో విడుదల కాదు. 2026లో విడుదల అవుతుందని రూ. లక్ష బెట్ కడుతున్నాను’ అని యాక్టర్ అంటే, ‘2025లో అవుతుందని నేను, అవదని తను.. పందెం పెట్టుకుంటున్నాం’ అని అన్నారు దర్శకుడు. ఇంతకీ ఎవరా నటుడు? ఎవరా దర్శకుడు? అని అనుకుంటున్నారు కదా. సినిమా పేరు ‘మోగ్లీ’. దర్శకుడి పేరు సందీప్ రాజ్ (Sandeep Raj). నటుడు వచ్చేసి టాలెంటెడ్ యాక్టర్ బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar). ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పైన చెప్పుకున్న మ్యాటర్ ఉన్న వీడియోను షేర్ చేసిన బండి సరోజ్ కుమార్.. ‘‘ఈ వీడియో జూలై 25న తీసింది. నాకు జూన్‌లో సినిమా రిలీజ్ అవ్వుద్ది అని చెప్పి కమిట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రాజ్. ఇంకా చాలా చెప్పాడు.. అవన్నీ తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెప్తాలే. వీళ్ల స్పీడ్, నాకున్న అనుభవం దృష్టిలో పెట్టుకొని ఆరోజే పందెం వేశా. మరీ ఆలస్యంగా పోస్ట్ చేస్తే మనోడు ప్లేట్ ఫిరాయిస్తాడు. అందులో చాలా గొప్పోడు తను.. అందుకే ఇప్పుడే పోస్ట్ చేస్తున్నా. Mowgli 2025 or 2026??’’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన వారంతా కచ్చితంగా ఈ సినిమా 2025లోనే వస్తుందని కామెంట్స్ చేయడం విశేషం.
Also Read- Nayanthara: ‘మూకుతి అమ్మన్ 2’కు పవర్ ఫుల్ తెలుగు టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో
‘నిర్భంధం, మాంగళ్యం, పరాక్రమం’ వంటి సినిమాలతో హీరోగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా.. (ఇంకా చాలా ఉన్నాయి) మల్టీ టాలెంట్‌ను ప్రదర్శించిన బండి సరోజ్ కుమార్.. ఫస్ట్ టైమ్ మరో దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ‘మోగ్లీ’ సినిమాకు సంబంధించి, ఇటీవల ఆయన చేసిన కొన్ని ట్వీట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నిర్మాణ సంస్థ అయిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్స్.. ఇండస్ట్రీలో దుమారాన్ని రేపాయి. తర్వాత అంతా కూల్ అయిందనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు మళ్లీ ఈ వీడియోను షేర్ చేయడంతో.. మరోసారి ‘మోగ్లీ’ వార్తలలో హైలెట్ అవుతోంది.
Also Read- Chaitanya Rao: ‘ఘాటి’ విలన్ హీరోగా.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చిత్రం! క్లాప్ కొట్టిందెవరంటే?
సుమ తనయుడి రెండో చిత్రం
‘మోగ్లీ’ విషయానికి వస్తే.. స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా నటిస్తున్న రెండో చిత్రమిది. తొలి చిత్రం ‘బబుల్ గమ్’తో మంచి సక్సెస్‌ను అందుకున్న రోషన్.. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో ‘మోగ్లీ’గా రెండో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. షూటింగ్ ఆలస్యం కారణంగా ఇంకా రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాలేదు. కానీ కచ్చితంగా 2025లోనే సినిమా విడుదల అవుతుందని దర్శకుడు చెబుతున్నారు. ఈ సినిమా టైటిల్‌లో కూడా ఆయన ‘మోగ్లీ 2025’ (Mowgli 2025) అని జత చేశారు. రోషన్ కనకాల సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ చిత్ర గ్లింప్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వీడియో జూలై 25న తీసింది. నాకు జూన్ లో సినిమా రిలీజ్ అవ్వుద్ది అని చెప్పి కమిట్ చేశాడు డైరెక్టర్ @SandeepRaaaj 😜 ఇంకా చాలా చెప్పాడు తర్వాత installment లో చెప్తాలే. వీళ్ల స్పీడ్, నాకున్న అనుభవం దృష్టిలో పెట్టుకొని ఆరోజే పందెం వేశా. మరీ ఆలస్యంగా పోస్ట్ చేస్తే మనోడు ప్లేట్… pic.twitter.com/e9xAYf16kD
— Saroj (@publicstar_bsk) October 3, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
