pawan kalyan
Politics

Deputy CM: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనూహ్య తీర్పు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు కేబినెట్ కూర్పు, శాఖల కేటాయింపులు జరుగుతున్నాయి. మంత్రుల పేర్లు ఖరారైనా.. వారికి కేటాయించే శాఖలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. కానీ, కొన్ని విషయాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని తేలిపోతున్నది. అధికారికంగా ఇంకా ఈ ప్రకటన రాకున్నా.. పలువురు ప్రముఖులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కన్ఫామ్ అని కేంద్ర మంత్రి అమిత్ షా, చిరంజీవి ట్వీట్లు చూస్తే అర్థమైపోతుంది.

ఈ రోజు చంద్రబాబు నాయుడు సహా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు అతిరథమహారథులు హాజరయ్యారు. ప్రధాని మోదీ, అమిత్ షా సహా ప్రముఖులు ఏపీకి వచ్చారు. అనంతరం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ప్రమాణం తీసుకున్న ఇతర మంత్రులకు అభినందనలు అని పేర్కొన్నారు. చిరంజీవి కూడా ఇలాంటి ట్వీటే చేశారు. ఏపీ సీఎంగా నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎంగా కొణిదల పవన్ కళ్యాణ్, మిగిలిన మంత్రులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

వీరి ట్వీట్‌లలో చంద్రబాబును సీఎంగా పేర్కొంటే.. పవన్ కళ్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా కన్ఫామ్ చేసేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు నుంచి ఈ ప్రకటన రావాల్సి ఉన్నది. ఈ రోజు సాయంత్రం అధికారికంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని ఖరారు కావాల్సి ఉన్నది.

చిరు లీక్స్:

చిరంజీవికి చాలా ముఖ్యమైన విషయాలను ముందుగానే లీక్ చేసే అలవాటున్నది. గతంలో సినిమా పేర్లు, స్టోరీ లైన్, ఇతర సీక్రెట్ విషయాలను తొట్టతొలిగా ఆయనే లీక్ చేసిన ఉదాహరణలు ఉన్నాయి. చిరంజీవి లీక్స్ సినిమాలకే పరిమితం కాలేదు. తాజాగా తన సోదరుడు పవన్ కళ్యాణ్ విషయమై రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న నిర్ణయాన్ని ముందుగానే లీక్ చేశారు. పవన్ కళ్యాణ్ కాబోయే డిప్యూటీ సీఎం అని ముందస్తుగానే చెప్పకనే ట్వీట్ ద్వారా చెప్పేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!