Ugly Story Teaser: ‘చిన్నారి పెళ్లికూతురు’ అవికా గోర్ (Avika Gor) ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. తన ప్రియుడు మిళింద్ చద్వానీని సెప్టెంబర్ 30న వివాహం చేసుకుని, మరో కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి.. ‘బాలిక నుంచి వధువు వరకు’ అనే క్యాప్షన్‌ను జోడించగా, ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇంకా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సంచరిస్తుండగానే.. ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చేసింది అవికా గోర్. అదేంటని అనుకుంటున్నారా? ఆమె హీరోయిన్‌గా నటించిన ‘అగ్లీ స్టోరీ’ టీజర్ (Ugly Story Teaser)ను మేకర్స్ విజయ దశమిని పురస్కరించుకుని గురువారం విడుదల చేశారు. ఈ టీజర్ ఎంత బోల్డ్‌గా ఉందంటే.. ఇంతకుముందు ఎప్పుడూ ఆమె ఇలాంటి పాత్రలో కనిపించలేదంటే నమ్మాలి. నందు (Nandu), అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రియా జియా ప్రొడక్షన్స్ పతాకంపై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో పాటు ‘హే ప్రియతమా’ అనే లిరికల్ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకోగా, ఇప్పుడొచ్చిన టీజర్, అసలీ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటనేది క్లారిటీ ఇచ్చేసింది.
Also Read- Chaitanya Rao: ‘ఘాటి’ విలన్ హీరోగా.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చిత్రం! క్లాప్ కొట్టిందెవరంటే?
వాళ్లది ప్రేమ, నీది కోరిక
ఈ టీజర్‌ని గమనిస్తే.. ముందుగా సిగరెట్ కాలుస్తున్న నందు పరిచయంతో ఈ టీజర్ మొదలైంది. అతడిది పర్వర్ట్ క్యారెక్టర్ అన్నట్టుగా, ఆయన కనిపించిన ప్రతి సన్నివేశాన్ని మలిచారు. అవికా గోర్ వెనుక పిచ్చి ప్రేమికుడిగా తిరిగే విధానం, ఆమెను ఎలా పడితే అలా చూసే విధానంతో, ఇందులోని నందు పాత్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నందును కాకుండా అవికా గోర్ మరొక అబ్బాయిని ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమికుడిపై నందుకు అటాక్ చేసినట్లుగా చూపించారు. మరొకరిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నామని అవికా గోర్ చెప్పినా సరే.. వదలకుండా ఆమెను నందు వేధిస్తూనే ఉంటాడు. ‘వాళ్ళది ప్రేమ, అందుకే కలిసుకున్నారు. నీది కోరిక, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావ్’ అని డైలాగ్‌కు సింక్ చేస్తూ.. స్క్రీన్ మీద అవికా గోర్ – రవితేజ మహాదాస్యం పెళ్లిని, మెంటల్ ఆస్పత్రిలో నందును చూపించారు. కథలో ట్విస్టులతో పాటు చివర్లో అవికా గోర్ ప్రేమ కోసం నందు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటే, చివరి షాట్ ఒకే మంచం మీద నందు, అవికా ఉన్నట్లుగా చూపించి.. దర్శకుడు మెంటలెక్కించేశాడు. మొత్తంగా అయితే, చాలా వినూత్నంగా ఈ ‘అగ్లీ స్లోరీ’ రూపుదిద్దుకుంటుందనే విషయాన్ని ఈ టీజర్ తెలియజేసింది. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read- Akshay Kumar: అలాంటి ఫొటోలను పంపుతారా? తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటనను తెలిపిన అక్షయ్!
ప్రాణం పెట్టేశారు
నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శివాజీ రాజా, రవితేజ మహదాస్యం, ప్రజ్ఞ వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లు నటిస్తున్నారు. ఈ టీజర్ చూసిన తర్వాత నెటిజన్ల రియాక్షన్ చాలా ఆసక్తికరంగా ఉండటం విశేషం. టీజర్‌లో వచ్చే సన్నివేశాలు అగ్లీగా అనిపించినా, అందులోని పాత్రకు నందు, అవికా గోర్ ప్రాణం పెట్టేశారని చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని నెటిజన్లు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నందు, అవికా గోర్‌ల నటన అద్భుతం అంటూ నెటిజన్లు ప్రశంసిస్తుండటం చూస్తుంటే.. ఈ టీజర్ వారిని ఎంతగా టచ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
