Web series: డిజిటల్ యుగంలో మనం అందరమూ ఆడుకుంటున్న గేమ్‌లు, సోషల్ మీడియా… ఇవి మన జీవితాల్లో ఎంత పెద్ద పాత్ర పోషిస్తున్నాయో అందరికీ తెలిసిందే. కానీ, ఈ గేమ్‌లు, ఆన్‌లైన్ ప్రపంచం మనల్ని ఎలా మోసం చేస్తాయి, మనల్ని ఎలా బెదిరిస్తాయి అనేది తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్త కాన్సెప్ట్ కాదు. ఇలాంటి థ్రిల్లర్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లోని వెబ్ సిరీస్ ‘ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్’ (The Game: You Never Play Alone) గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ రాజేష్ ఎం. సెల్వా డైరెక్షన్‌లో, ష్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఏడు ఎపిసోడ్‌లతో ఉన్న ఈ షో సైబర్ బుల్లింగ్, మహిళలపై జెండర్ డిస్క్రిమినేషన్ వంటి టాపిక్స్‌ను తాకుతూ, మనల్ని ఆలోచింపజేస్తుంది. ఫ్రెంచ్ సిరీస్ ‘లె జ్యూ’ (Le Jeu) ఆధారంగా రూపొందిన ఈ షో, డీప్తి గోవిందరాజన్ రచనలో వచ్చింది. నెట్ల ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ
సీరీస్ మొదలు కవ్యా రాజరామ్ (ష్రద్ధా శ్రీనాథ్)తో ప్రారంభమవుతుంది. ఆమె ఒక టాలెంటెడ్ గేమ్ డెవలపర్, మూన్ బోల్ట్ కంపెనీలో పని చేస్తుంది. మహిళలు టాక్సిక్ సిట్యువేషన్స్ నుంచి ఎస్కేప్ అయ్యే గేమ్‌ను డెవలప్ చేసి, అవార్డ్ గెలిచిన ఆమె జీవితం హ్యాపీగా సాగుతుంది. కానీ, మగ డామినేటెడ్ గేమింగ్ ఇండస్ట్రీలో ఆమె మీద ట్రోలింగ్, మిసాజినిస్టిక్ అటాక్స్ మొదలవుతాయి. ఆమె భర్త అనూప్ (సంతోష్ ప్రతాప్) కూడా అదే కంపెనీలో స్టార్ డెవలపర్, కానీ అతని గేమ్ ‘మాస్క్ మేయ్హెమ్’ వల్ల కొన్ని లీగల్ ట్రబుల్స్ వస్తాయి. కవ్యా అవార్డ్ గెలిచిన రోజు ఒక షాకింగ్ అటాక్ జరుగుతుంది, ఆ తర్వాత ఆమె తనను తాను ప్రైవేట్ డిటెక్టివ్‌లా మార్చుకుని, కోలీగ్స్ ఆన్నె (శ్యామా హరిణి), డాని (ముకుంద్ కె. రాజేష్) సహాయంతో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్ భానుమతి (చందిని తమిళరసన్) అధికారిక ఇన్వెస్టిగేషన్ చేస్తూ, వర్క్‌ప్లేస్ సెక్సిజంతో పోరాడుతుంది. ఇంకా, కవ్యా నెప్యూ తారా (హేమ) ఆన్‌లైన్ ప్రెడేటర్స్ వల్ల ఫేస్ చేసే నైట్‌మేర్ సబ్‌ప్లాట్ కూడా ఉంది. మొత్తంగా, డార్క్ వెబ్, ఆన్‌లైన్ డీసెప్షన్, ఐడెంటిటీ క్రైసిస్ వంటి థీమ్స్‌తో ముందుకు సాగుతుంది. మొదట్లో లైటర్ టోన్‌లో ఉండి, క్రమంగా డార్క్ థ్రిల్లర్‌గా మారుతుంది.
బలాలు
ఈ సీరీస్ మనల్ని స్క్రీన్‌కు కట్టిపడేసేలా డిజైన్ చేయబడింది. డిజిటల్ ఏజ్ రియాలిటీస్‌ను చూపిస్తుంది. సోషల్ మీడియా డార్క్ సైడ్‌ను ఎక్స్‌పోజ్ చేయడం అద్భుతంగా ఉంది. ఆన్‌లైన్ ట్రోలింగ్, మార్ఫ్డ్ ఇమేజెస్, అనానిమస్ అకౌంట్స్ వల్ల వచ్చే బుల్లింగ్… ఇవన్నీ రియల్-లైఫ్ ఇష్యూస్‌లా చూపించారు. మహిళలు, యంగ్ అడల్ట్స్, పేరెంట్స్‌కు కళ్లు తెరిపించేలా ఉంటుంది. డైరెక్టర్ రాజేష్ సెల్వా, రైటర్స్ వర్క్‌లో ఇమర్సివ్ మిస్టరీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగా పెట్టారు. ష్రద్ధా శ్రీనాథ్ పెర్ఫార్మెన్స్ టాప్‌క్లాస్, రెసిలియెన్స్, వల్నరబిలిటీ అన్నీ పర్ఫెక్ట్‌గా చేసింది. ఆమె డొమెస్టిక్ ట్రబుల్స్, వర్క్‌ప్లేస్ కాన్‌ఫ్లిక్ట్స్‌లో ఇంటెలిజెన్స్, కొరేజ్ చూపించింది. శ్యామా హరిణి (ఆన్నె) సెకండరీ క్యాస్ట్‌లో స్టాండ్ అవుట్. చందిని తమిళరసన్ (భానుమతి) కూడా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే కొన్ని టైమ్స్ సస్పెన్స్ కోసం సైడ్‌లైన్ చేయబడింది. సంతోష్ ప్రతాప్ అనూప్‌గా సపోర్టివ్‌గా ఉన్నాడు, కానీ క్యారెక్టర్ లేయర్స్ మరింత ఎక్స్‌ప్లోర్ చేస్తే మంచిది.
Read also-Local Body Elections: బండి వర్సెస్ ఈటల.. మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. బీజేపీ తర్జన భర్జన
బలహీనతలు
ప్రామిసింగ్ థ్రిల్లర్ అయినప్పటికీ, ఎక్సిక్యూషన్‌లో కొన్ని లోపాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో అటాకర్ మోటివ్ అన్‌కన్విన్సింగ్‌గా ఉంది, బిల్డ్-అప్‌ను వదిలేస్తుంది. గేమింగ్ కల్చర్, మిసాజినీ ఎక్స్‌ప్లోరేషన్ షాలోగా ఉంది – కవ్యా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ రాష్, రిస్కీగా అనిపిస్తుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ను హిండర్ చేస్తుంది. అనూప్ గేమ్ సబ్‌ప్లాట్ సర్ఫేస్-లెవల్‌లోనే ఉంది. డీపర్ ఎక్స్‌ప్లోరేషన్ లేదు. వైలెన్స్ రిజల్ట్స్‌ను గ్లాస్ ఓవర్ చేస్తుంది. మొత్తంగా, ఇంటెంషన్ మంచిదే కానీ, ఇంపాక్ట్ పూర్తిగా లేదు.
