Nani Sujeeth: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG Movie) బ్లాక్ బస్టర్ తర్వాత సుజీత్ (Sujeeth) చేయబోతున్న చిత్రానికి క్లాప్ పడింది. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani)తో ఆయన తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. వాస్తవానికి ఈ కాంబినేషన్‌లో సినిమా అంటూ ఎప్పుడో ప్రకటన వచ్చింది.. కానీ, కార్యరూపం దాల్చలేదు. ఫైనల్‌గా ఈ సినిమా విజయ దశమిని పురస్కరించుకుని, గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు సుజీత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందించిన ‘ఓజీ’ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తుండటంతో.. ఇప్పుడప్పుడే ఈ సినిమా ప్రారంభం కాదని అంతా అనుకున్నారు. కానీ, అది అదే, ఇది ఇదే అన్నట్లుగా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి క్లాప్ కొట్టేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటేశ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read- Jr NTR: ఊహకందని అద్భుతం.. ‘కాంతార: చాప్టర్ 1’ రెస్పాన్స్‌పై తారక్ ఆసక్తికర పోస్ట్
ఆసక్తికర అప్డేట్స్ రాబోతున్నాయ్..
వెంకటేశ్ ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరు కావడంతో, సినిమాలో ఆయన కూడా భాగమవుతున్నారా? అనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత వెంకట్ బోయనపల్లి మాత్రం ఈ వేడుకకు హాజరైన వెంకటేష్, రాహుల్ సాంకృత్యాన్, శ్రీకాంత్ ఓదెల, దీప్తి గంటా, శౌర్యువ్, రామ్ జగదీష్‌లకు థ్యాంక్స్ చెప్పారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది, ఇది నాని ప్రొడక్ట్ అని, మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ రాబోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ మూవీ లాంఛింగ్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ‘ఓజీ’ తర్వాత ఎటువంటి కాన్సెప్ట్‌తో సుజీత్ ఈ సినిమాను చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read- Rahul Ramakrishna: కేసీఆర్, కేటీఆర్.. కలకలం రేపుతోన్న రాహుల్ రామకృష్ణ ట్వీట్స్!
‘ఓజీ’ యూనివర్స్‌లో భాగం కాదు
ఇక ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలన్నింటికీ ‘ఓజీ’ ప్రమోషన్స్‌లో సుజీత్ చెక్ పెడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ‘ఓజీ’ కంటే ముందే ఈ సినిమాను ప్రకటించినప్పటికీ, దాదాపు ఏడాది పాటు ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ చిత్రం క్యాన్సిల్ అయిందనేలా రూమర్స్ వచ్చాయి. ‘ఓజీ’ ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు సుజీత్ ఈ వార్తలను ఖండించారు. నానితో సినిమా కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేసి, తాజాగా ముహూర్తపు వేడుకతో రూమర్స్‌కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేశారు. అలాగే ఇది ‘ఓజీ’ యూనివర్స్‌లో భాగం కాదని కూడా ఆయన వివరణ ఇచ్చారు. నానితో చేయబోయే చిత్రం ‘ఓజీ’ యూనివర్స్‌లో భాగమా? అని ‘ఓజీ’ ప్రమోషన్స్‌లో అడిగినప్పుడు ‘ఈ సినిమా నా తొలి చిత్రం ‘రన్ రాజా రన్’ స్టైల్‌లో ఫన్, యాక్షన్ కలగలిపి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ మొదటి నుంచి ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఫైనల్‌గా మేకర్స్ ఏం టైటిల్ ఫిక్స్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. అప్పటి వరకు ఈ సినిమా నాని34, నాని-సుజీత్ సినిమాగా ప్రచారం కానుంది.
On the auspicious occasion of Vijayadashami 🙏🏻
We’ve begun our special journey, #NanixSujeeth, with a traditional Pooja ceremony ❤️
A heartfelt thanks to dear Victory @VenkyMama garu for taking time out and gracing the launch with his presence 🤗
Grateful to dear Rambabu garu… pic.twitter.com/sr8twhMTmc
— Venkat Boyanapalli (@vboyanapalli) October 2, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు