Raju Gari Gadhi 4: హారర్ కామెడీ సినిమాలను ఆసక్తికరంగా తెరకెక్కించగలిగితే.. ప్రేక్షకులు ఎప్పుడూ వాటిని హిట్ చేస్తూనే ఉంటారు. అందుకు ఉదాహరణే ‘రాజు గారి గది’ (Raju Gari Gadhi), ‘కాంచన’ (Kanchana) చిత్రాలు. ఈ రెండూ కూడా ఇప్పుడూ నాలుగో పార్ట్‌కు చేరుకున్నాయి. ‘కాంచన 4’ సినిమా క్యాస్టింగ్ విషయంలో రోజూ వార్తలలో నిలుస్తూనే ఉంది. ఈసారి పూజా హెగ్డే ఈ పార్ట్‌లో భాగం కాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ‘రాజు గారి గది’ సిరీస్ కూడా ఇప్పుడు నాల్గవ పార్ట్‌కు చేరింది. ‘రాజు గారి గది 3’ చిత్రానికి పార్ట్ 4 (Raju Gari Gadhi 4)కు చాలా గ్యాప్ ఉన్నప్పటికీ, ఈ విజయ దశమిని పురస్కరించుకుని మేకర్స్ ఓ పవర్ ఫుల్ అప్డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమా ఇంకా ప్రారంభం కూడా కాలేదు.. అప్పుడే విడుదల ఎప్పుడో కూడా మేకర్స్ చెప్పేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Sujeeth: ‘ఓజీ’ నిర్మాత అలా అడిగే సరికి.. నా నోటి నుంచి మాట రాలేదు
డివైన్ హారర్ బిగిన్స్
విజయ దశమి కానుకగా విడుదల చేసిన ఈ పోస్టర్‌ను గమనిస్తే.. ఉగ్రరూపంలో ఉన్న కాళికా మాత ముందు.. ఓ యువతి ఎర్రచీరలో ఎదురుగా గాలిలో తేలుతూ కనిపిస్తోంది. కాళికాపురం అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన మూడు పార్ట్‌లను మించి ఈ పార్ట్ ఉండబోతుందనేలా మేకర్స్ ఈ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చేశారు. ఈ పార్ట్‌కి డివోషనల్ టచ్ కూడా ఇవ్వబోతున్నట్లుగా డివైన్ హారర్ బిగిన్స్ అని ఈ పోస్టర్‌తో మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. పోస్టర్‌తోనే హైప్ వచ్చేలా చేసిన మేకర్స్.. ఇందులో నటించబోయే తారాగణం గురించి ఏం రివీల్ చేయలేదు. ఓ ప్రముఖ హీరో నటించబోతున్నట్లుగా అయితే టాక్ నడుస్తుంది. ఇంతకు ఈ సిరీస్ చిత్రాలలో కింగ్ అక్కినేని నాగార్జున, సమంత వంటి స్టార్స్ భాగమైన విషయం తెలిసిందే. ఆ లెక్కన చూస్తే.. ఈసారి కూడా ఓ స్టార్ హీరో ఇందులో నటించే అవకాశమే ఉందని అంతా అనుకుంటున్నారు.
Also Read- Rahul Ramakrishna: కేసీఆర్, కేటీఆర్.. కలకలం రేపుతోన్న రాహుల్ రామకృష్ణ ట్వీట్స్!
మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం
అందుకు కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే.. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మిస్తుండటం. టీజీ విశ్వప్రసాద్ ఈ మధ్య సక్సెస్ మూడ్‌లో ఉన్నారు. అందుకే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా నిర్మించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు వచ్చిన మూడు పార్ట్‌లలో తన వైవిధ్యతను చాటిన దర్శకుడు ఓంకార్ (Ohmkar).. ఈ పార్ట్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది కూడా ఈ పోస్టర్‌పై రివీల్ చేశారు. సరిగ్గా సంవత్సరానికి అంటే, 2026 దసరాకు ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తుండటం. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. ఈ టెక్నీషియన్స్‌ని చూస్తుంటే అర్థమవుతుంది కదా.. ఈ సినిమా ఏ రేంజ్‌లో రూపుదిద్దుకోనుందనేది. చూద్దాం.. ఈ పార్ట్‌లో ఎలాంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తారో..
When devotion breaks…her wrath awakens 🔥
On this auspicious Vijayadashami, the horror saga that shook Telugu cinema is back ❤️🔥#RajuGariGadhi4 – SRI CHAKRAM 💥
The shoot begins soon… the fear begins sooner 😱#HappyDussehra 🔱@Withloveohmkar @vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/BVoRF78ViB
— People Media Factory (@peoplemediafcy) October 2, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు