Sujeeth: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించిన చిత్రం ‘ఓజీ’ (They Call Him OG). సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం రూ. 300 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా సాధించిన విజయంతో చిత్రయూనిట్ మొత్తం హ్యాపీగా ఉంది. ఎప్పుడూ లేనిది, ఈ సినిమా కోసం నిర్వహించిన ప్రమోషన్స్ ఈవెంట్స్‌లో కటానా, జానీ మెషిన్ గన్ పట్టుకుని పవర్ స్టార్ దర్శనం ఇవ్వడం అభిమానులకు ఫుట్ ట్రీట్ ఇచ్చేసింది. మొదటి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు మీడియాతో పాటు కేవలం చిత్రబృందం మాత్రమే హాజరవడం విశేషం. ఇక ఈ వేడుకలో ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి పెద్దగా మాట్లాడని దర్శకుడు సుజీత్.. ఈ వేడుకలో మాత్రం చాలా ఎక్కువగానే మాట్లాడారు. ముఖ్యంగా నిర్మాత తనకు చెప్పిన మాటతో.. నోటి నుంచి మాట రాలేదని చెప్పారు.
Also Read- Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’.. అమెరికా నుండి వచ్చిన ఐటమ్ అదిరింది
నా నోటి నుంచి మాట రాలేదు
ఈ కార్యక్రమంలో సుజీత్ మాట్లాడుతూ.. పవర్ స్టార్‌తో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అసలు కథ కూడా రాసుకోలేదు. ఆయనని కలిస్తే చాలు అని చాలా బలంగా మాత్రం అనుకున్నాను. అలాంటిది, ప్రకృతి ఎంత బలమైంది అంటే.. నన్ను తీసుకువచ్చి ఆయనతో సినిమా చేసేలా చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ నా పేరు చెప్పడం వల్లే.. ఈ అవకాశం నాకు వచ్చింది. ఆయనే వచ్చి నువ్వు పవర్ స్టార్‌తో ఒక సినిమా చేస్తే బాగుంటుందని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ తర్వాతే నిర్మాత డీవీవీ దానయ్యను కలవడం జరిగింది. ఆయనని కలిసినప్పుడు చెప్పిన ఒకే ఒక్క మాట నాకు ఇంకా గుర్తుంది. సినిమా ఎలా అయినా సరే.. హిట్ కావాలి. అందుకు నీకు ఏం కావాలో అడుగు. నా బ్యానర్‌లో ఆయనకు పెద్ద హిట్ ఇవ్వాలి అని అనేసరికి.. నిజంగా ఆ రోజు నా నోటి నుంచి మాట రాలేదు. అంతే, అప్పటి నుంచి సినిమా పూర్తయ్యే వరకు ఏది కావాలంటే అది ఇచ్చారు.
Also Read- Mana Shankara Varaprasad Garu: ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా మెగాస్టార్ ఇలా?
ఓ విషయం అడగడానికి ధైర్యం సరిపోలేదు
ఇంకా ఈ సినిమాకు బ్యాక్ బోన్ అనిపించుకుంటున్న థమన్ అన్న.. సినిమాకే కాదు నాకు కూడా ఒక బ్యాక్ బోన్‌లా.. సినిమా పూర్తయ్యే వరకు నిలబడ్డాడు. అందరూ సినిమాకి చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. రవి కె చంద్రన్‌కు ముందు స్టోరీ చెప్పడానికి వెళ్లాను. దాదాపు 6 గంటల పాటు ఆయనకు సినిమా గురించి చెప్పాను. అప్పుడాయన ఒక్కటే మాట అన్నారు.. నిజంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారా? అని అడిగారు. ఆ తర్వాత రోజు సినిమా సెకండాఫ్ స్టోరీ చెప్పే సరికి.. ఓకే అదిరిపోయింది.. ఇక ఫస్టాఫ్ సంగతి మనం చూసుకుందామని చెప్పి, ఆయన ఇచ్చిన సపోర్ట్.. నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. పవర్ స్టార్‌తో సినిమా చేస్తున్నంత కాలం.. ఆయనని ఓ విషయం అడగడానికి ధైర్యం సరిపోలేదు. ఏదయితే అది అయ్యిందని ఒక రోజు ముంబైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు టీమ్ మొత్తంతో అడిగించిన తర్వాత.. నేను కూడా అడిగా. ‘సార్ ఈ సినిమా హిట్ అయితే ఇంకొక సినిమా చేద్దాం సార్’ అని. అప్పుడాయన ఇచ్చిన సమాధానం వల్లే ఈరోజు ఓజీ యూనివర్స్ స్టార్ట్ అయ్యిందని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు