- తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- టి.జి. టెట్-2024కు ధరఖాస్తు చేసుకున్న 2,86,381 మంది అభ్యర్థులు.
- పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. అర్హత సాధించిన 57,725 అభ్యర్థులు.
- పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. అర్హత సాధించిన 51,443 అభ్యర్థులు.
- పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13%
- పేపర్-2లో అర్హత సాధించిన వారు 34.18%
- https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఫలితాలు.
- 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% పెరిగిన అర్హత శాతం
- 20023తో పోలిస్తే పేపర్-2లో 18.88% పెరిగిన అర్హత శాతం
TG set 2024 results released 2lakhs 86 thousand 381 candidates applied:
ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునేవారు వృత్తి విద్యా కోర్సు అయిన బీఈడీని పూర్తిచేయాల్సివుంటుంది. ఈ కోర్సులో ప్రవేశం కోసం ఎడ్ సెట్ ప్రవేశపరీక్షను రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చే మార్కులతో బీఈడీ కాలేజీలలో సీటు పొందొచ్చు. ప్రతి ఏడాదీ బీఈడీ కోర్సల్లో ప్రవేశాలకు ఎడ్ సెట్ నిర్వహిస్తారు. ఈ సారి కూడా నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో మే 23న ఎడ్ సెట్ ఎంట్రెన్స్ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించిన ప్రిలిమరీ కీని అధికారులు ఇటీవల విడుదల చేశారు. అయితే టీజీ ఎడ్ సెట్ పరీక్ష రాసిన వేలాది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తాజాగా ఫలితాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నాగర్‌కర్నూలుకు చెందిన నవీన్‌కు మొదటి ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన అషిత రెండు, మూడో ర్యాంకులో శ్రీతేజ నిలిచారు. ఎడ్‌సెట్‌కు 29,463మంది దరఖాస్తు చేసుకోగా.. 28,549మంది (96.90%) ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. మొత్తం 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షను మే 23న నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 29, 463 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా.. ఈసారి ఎడ్‌సెట్ పరీక్షలను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించింది. రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో మొత్తం 14, 285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తుదారులకు ఉపశమనం
టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. అలాగే టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.