camred-kalyan( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Comrade Kalyan Title Teaser: హీరో శ్రీ విష్ణు ఈ టైటిల్ టీజర్ చూశారా.. ఏంటి భయ్యా అలా మారిపోయావ్..

Comrade Kalyan Title Teaser: శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా టైటిల్ టీజర్ విడుదలైంది. దసరా సందర్భంగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ కు సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు.  దర్శకుడిగా పరిచయమవుతున్న జానకి రామ్ మారెల్ల శ్రీ విష్ణును హార్డ్‌కోర్ నక్సలైట్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ సినిమాకు నిర్మాతలుగా కానా వెంకట్ ప్రెజెంట్ చేస్తున్నారు. సాయి శ్రీరామ్ కెమెరా మెన్ గా వ్యవహరిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 1992లో ఆంధ్ర-ఒడిషా సరిహద్దు ప్రాంతంలో నక్సల్ ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది తీవ్రమైన రాజకీయ టెన్షన్‌తో పాటు ప్రేమ కథ, హాస్య భావాలతో ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలుస్తోంది. రాధికా శరత్‌కుమార్ తదితరులు ఈ సినిమాలో ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.

Read also-KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో దసరా వేడుకలు.. ఆయుధపూజలో పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్

ఎప్పటిలా కామెడీ చిత్రాలు కాకుండా ఈ సినిమాలో శ్రీ విష్ణు నక్సలైట్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఎప్పుడూ తన వైవిధ్యమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు శ్రీ విష్టు. దసరా సందర్భంగా విడుదలైన టైటిల్ టీజర్ శ్రీ విష్ణు పవర్ ఫుల్ లుక్‌తో ప్రారంభమవుతుంది. అతను పోలీసులను సవాలు చేస్తూ తన సొంత పోస్టర్‌ను గొడకు అతుక్కునే సీన్, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆకట్టుకునే విజువల్స్ ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టైటిల్ టీజర్ రివీల్ అవుతుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా ఎక్కడా తగ్గకుండా రిచ్ గా తీశారు.  డైరెక్టర్ జానకిరామ్ మారెల్ల ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుందని చెబుతున్నారు. ‘కామ్రెడ్ కళ్యాణ్’తో శ్రీ విష్ణు మరోసారి తన ప్రక్షకులను మెప్పిస్తారని, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని నిర్మాతలు చెబుతున్నారు.

Read also-Shocking Video: ర్యాంప్ వాక్ చేస్తుండగా భూకంపం.. హడలిపోయిన మోడల్స్.. దెబ్బకు పరుగో పరుగు!

శ్రీ విష్ణు మొదటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ ‘మృత్యుంజయ’. హస్సైన్ షా కిరణ్ దర్శకత్వంలో, జస్ట్ యెల్లో బ్యానర్‌పై గున్నం గంగారాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. రీబా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తించింది. పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. ఇది శ్రీ విష్ణు కెరీర్‌లో థ్రిల్లర్ జోన్‌లోకి ప్రవేశానికి మైలురాయి కానుంది. ‘హీరో హీరోయిన్’ (Hero Heroine)శ్రీ విష్ణు మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హీరో హీరోయిన్’. ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్రం, 2025 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. కథాంశ వివరాలు ఇంకా పూర్తిగా బయటపడలేదు. కానీ హాస్యం, ఎమోషన్స్ కలిపిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్మాణ బృందం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్, శ్రీ విష్ణు వర్సటాలిటీని మరింత ప్రదర్శిస్తుందని అంచనా. ఈ టైటిల్ టీజర్ చూసిని శ్రీ విష్ణు అభిమానులు సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Just In

01

Mana Shankara Varaprasad Garu: ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా మెగాస్టార్ ఇలా?

Ponnam Prabhakar: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి మంత్రి పొన్నం ధన్యవాదాలు.. కారణం ఏంటంటే?

Rahul Ramakrishna: కేసీఆర్, కేటీఆర్.. కలకలం రేపుతోన్న రాహుల్ రామకృష్ణ ట్వీట్స్!

IOB Good News: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అదిరిపోయే గుడ్‌న్యూస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘పురుష:’ ఎంత వరకు వచ్చిందంటే..