KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర రావు నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎర్రవల్లిలోని నివాసంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ దుర్గా మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దుర్గా మాతను ప్రార్ధించారు.
కాగా బుధవారమే రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలను కేసీఆర్ తెలియజేశారు. ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలని ఆకాంక్షించారు. దసరాకు తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. దసరా పండుగ విశిష్టతను గౌరవిస్తూ.. జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో బతుకమ్మతో పాటు విజయ దశమి స్ఫూర్తి ఇమిడి ఉందని అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఎర్రవెల్లిలోని నివాసంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… pic.twitter.com/5aiR5OovFq
— BRS Party (@BRSparty) October 2, 2025
Also Read: Shocking Video: ర్యాంప్ వాక్ చేస్తుండగా భూకంపం.. హడలిపోయిన మోడల్స్.. దెబ్బకు పరుగో పరుగు!
మరోవైపు దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. హైదరాబాద్ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంజరాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులతో కలిసి దసరా పూజు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత పాలపిట్టను ఎగరవేయడం విశేషం.
దసరా పండుగ సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో దసరా పూజలో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. pic.twitter.com/HnFowpg3Rc
— Telangana Jagruthi (@TJagruthi) October 2, 2025
Offered prayers at Peddamma Thalli Temple on the eve of Dussehra. Prayed for peace, prosperity, and well-being of all 🙏 pic.twitter.com/iHI7Giwqrb
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 2, 2025