Jr NTR: ‘కాంతార: చాప్టర్ 1’ రెస్పాన్స్‌‌పై తారక్ ఆసక్తికర పోస్ట్
Jr NTR on Kantara Chapter 1
ఎంటర్‌టైన్‌మెంట్

Jr NTR: ఊహకందని అద్భుతం.. ‘కాంతార: చాప్టర్ 1’ రెస్పాన్స్‌‌పై తారక్ ఆసక్తికర పోస్ట్

Jr NTR: మరోసారి ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1) సినిమా గురించి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses Jr NTR) స్పందించారు. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్, ప్రస్తుతం సినిమా థియేటర్లలో విడుదలై, పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని, మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్టీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తన మిత్రుడు రిషబ్ శెట్టి (Rishab Shetty)కి, ‘కాంతార: చాప్టర్ 1’ టీమ్‌ను అభినందించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో బ్యాన్ చేయాలని చూశారు. తెలుగు సినిమాలపై కర్ణాటకలో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రాన్ని బ్యాన్ చేయాలని అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కల్పించుకుని, ఎవరో చేసిన మిస్టేక్‌ని మనం కూడా చేసి, యూనిటీని దెబ్బతీయడం కరెక్ట్ కాదని, ఎవరూ అలాంటి ఆలోచన చేయవద్దని పిలుపునిచ్చారు. దీంతో అందరూ వెనక్కి తగ్గారు. అంతేకాదు, ఈ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వెనుక కూడా పవన్ కళ్యాణ్ చొరవ చూపారు. దీంతో టీమంతా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read- Comrade Kalyan Title Teaser: హీరో శ్రీ విష్ణు ఈ టైటిల్ టీజర్ చూశారా.. ఏంటి భయ్యా అలా మారిపోయావ్..

ఊహకందని అద్భుతం

ఇక ఇప్పుడు సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులు, విమర్శకులందరి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుండటంతో.. ‘కాంతార: చాప్టర్ 1’ టీమ్‌కు యంగ్ టైగర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘‘రీ సౌండింగ్ సక్సెస్ అందుకున్న కాంతార: చాప్టర్ 1 యూనిట్‌కు నా అభినందనలు. నటుడిగా, దర్శకుడిగా సోదరుడు రిషబ్ శెట్టి ఊహకందని అద్భుతాన్ని సృష్టించాడు. ఆయనపై ఉన్న నమ్మకంతో, ఆయన విజన్‌ను అర్థం చేసుకుని, ఇంత గొప్ప ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కారణమైన హోంబల్ ఫిల్మ్స్ వారికి, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని తారక్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ అభిప్రాయాన్ని అందరూ ఏకీ భవిస్తూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Pawan Kalyan: అసలిప్పటి వరకు ‘ఓజీ’ స్టోరీ ఏంటో నాకు తెలీదు

కలెక్షన్ల సునామీ

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’. ఈ చిత్రాన్ని హీరో రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద మరో సంచలనాత్మక చిత్రంగా నిలిచేందుకు సిద్ధమైందీ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల, పాజిటివ్ టాక్ రావడంతో.. మరోసారి బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కలెక్షన్ల సునామీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

MyGHMC App: ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో చక్కటి ఫీచర్.. మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు ఇట్టే తెలుసుకోవచ్చు

Funky: విశ్వక్ ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. వాలెంటైన్స్ వీకెండ్ టార్గెట్‌గా!

VV Vinayak: ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌‌’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?

Jio New Year offers: హ్యాపీ న్యూఇయర్ ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో

Social Media Ban: ఆస్ట్రేలియా తర్వాత 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధించనున్న మరో దేశం