varun-tej(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Varun Tej baby: మెగా వారసుడి పేరు ప్రకటించిన వరుణ్ తేజ్.. ఏంటంటే?

Varun Tej baby: వారసుడి కోసం ఎంతగానో ఎదురు చూసిన మెగాస్టార్ కు వరుణ్ తేజ్ ఆ కోరిక తీర్చాడు. తాజాగా ఆ వారసుడికి సంబంధించిన పేరు ను ప్రకటించాడు వరుణ్ తేజ్. వారసుడి పేరును ‘వాయువ్ తేజ్’ గా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఒక వీడియోను షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు వరణ్ తేజ్ . అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన దశమి రోజున పేరు పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మెగా స్టార్ ఫ్యామిలీ ఆరాధించే ఆంజనేయుడి పేరు వచ్చేలా చూసుకున్నారు. అంతే కాకుండా వాయువ్ తేజ్ కు సంబంధించిన కొన్ని పోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ మొదటి సంతానంగా మగబిడ్డకు జన్మ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠికి సుఖప్రసవం జరిగింది. దీనిని చూసిన ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ మూడోతరం వారసుడొచ్చాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Read also-Madhya Pradesh: శిశువును చెత్తలో పడేసి.. పైన బండరాయి పెట్టిన తల్లిదండ్రులు.. 72 గంటల తర్వాత..

ఇప్పటికే వారసుడు లేడు అంటూ బాధ పడుతున్న మెగాస్టార్ కి ఈ విషయం చాలా ఆనందాన్ని ఇస్తుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమ కథ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక రొమాంటిక్ టేల్. 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా సెట్స్‌లో కలిసిన ఈ ఇద్దరూ, అక్కడే ప్రేమలో పడ్డారు. ‘అంతరీక్షం 9000 కిలోమీటర్లు’ వంటి సినిమాల్లో కలిసి పనిచేసిన తర్వాత, వారు ఏడు సంవత్సరాలు డేటింగ్ చేశారు. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ వెడ్డింగ్‌లో మెగా ఫ్యామిలీ సభ్యులైన రామ్ చరణ్, అల్లు అర్జున్, పంజా వైష్ణవ్ తేజ్, సై రాజరాజ్ వంటి సెలెబ్రిటీలు పాల్గొన్నారు. వివాహం తర్వాత ఇద్దరూ కూడా తమ కెరీర్‌ను కొనసాగించారు. కానీ కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు.

Read also-IND vs WI First Test: తొలి టెస్టులో చెలరేగిన సిరాజ్.. పీకల్లోతూ కష్టాల్లో వెస్టిండీస్.. ఇక వార్ వన్ సైడేనా!

వరుణ్ తేజ్ ఇటీవల ‘మట్కా’ సినిమాలో నటించారు, ఇది పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. తన తదుపరి సినిమా మెర్లపాక గాంధీ డైరెక్షన్‌లో హారర్ కామెడీగా రాబోతోంది. లావణ్య త్రిపాఠి ఇటీవల ‘హ్యాపీ బర్త్‌డే’ వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’లో కనిపించింది. తన తదుపరి సినిమా ‘సతి లీలావతి’లో మలయాళ నటుడు దేవ్ మోహన్‌తో కలిసి నటిస్తోంది. వీరిద్దరూ వివాహం తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు.

Just In

01

Ponnam Prabhakar: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి మంత్రి పొన్నం ధన్యవాదాలు.. కారణం ఏంటంటే?

Rahul Ramakrishna: కేసీఆర్, కేటీఆర్.. కలకలం రేపుతోన్న రాహుల్ రామకృష్ణ ట్వీట్స్!

IOB Good News: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అదిరిపోయే గుడ్‌న్యూస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘పురుష:’ ఎంత వరకు వచ్చిందంటే..

Planes collision: ఎయిర్‌పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు.. విరిగిపోయిన ఓ విమానం రెక్క