MLA Kaushik Reddy: లోకల్ బాడీ ఎన్నికలు అక్టోబర్ 9 నుండి 42% బి సి రిజర్వేషన్ లకు కేసీఆర్ మద్దతూ పూర్తిగా ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో(local body elections) బిఆర్ఎస్(BRS) జెండా ఎగరబోతుందనీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) అన్నారు. నియోజకవర్గంలో ప్రతి బిఆర్ఎస్ కార్యకర్తకి అండగా ఉంటానని మిమ్మల్ని గెలిపించుకుంటా అని అన్నారు. హుజురాబాద్(Huzurabad) నియోజకవర్గ ప్రజలకు పోయిన పది సంవత్సరాలలో అభివృద్ధి చేసింది కె సిఆర్(KCR) భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరులో, గ్రామపంచాయతీలో అద్భుతమైన అభివృద్ది చేసింది కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ
తెలంగాణ(Telangana)కు భారతదేశంలోనే అద్భుతమైన అవార్డు తీసుకొచ్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీ. కేసీఆర్(KCR) చేసిన అభివృద్ధిని గుర్తించి అవార్డులు ఇచ్చింన కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోదీ(Narendra Modi). గుజరాత్(Gujarath) లో నరేంద్రమోదీ చేయలేని అభివృద్ధి తెలంగాణ లో కేసీఆర్ తోనే సాధ్యమైంది. అభివృద్ధిలో తెలంగాణ లో ఉన్న గ్రామపంచాయతీ లకు అవార్డు దక్కింది అంటే అది కేసీఆర్ హయాంలో అభివృద్ధి కారణం. ఆరు గ్యారంటీలు, ఇవ్వడంలో విఫలమైంది కాంగ్రెస్(Congress) ప్రభుత్వం. పెళ్లి కానుకగా తులం బంగారం ఇస్తా అన్న ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన లక్ష వేయి నూట పదహార్లతోనే సరిపెట్టుకుంటున్నారు.
Also Read: OTT Movie: విడిపోయిన ప్రేమ జంట అనూహ్యంగా అలా చేస్తూ పట్టుబడితే.. ఏం చేశారంటే?
జర్నలిస్టుల ఇళ్లు
రైతులకు యూరియా(Urea) బస్తాలు ఇవ్వలేని ప్రభుత్వం ఓటు అడిగే హక్కు లేదు యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న ప్రభుత్వం యువతను ఏవిదంగా ఓటు హక్కు అడుగుతుంది. కేసీఆర్(KCR) ప్రభుత్వంలో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, ప్రతి మండలంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో బిఆర్ఎస్(BRS) పార్టీ జెట్ పిటిసి(ZPTC),ఎంపిపి(MPP), సర్పంచ్ లు, ప్రతి వార్డ్ లో వార్డు నెంబర్లు, అరువై రెండు ఎంపిటిసిలు(MPTC) బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్(KCR) నాయకత్వం లో గెలుపు కాయంమని అన్నారు. జర్నలిస్టుల ఇళ్లకు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నారు. జర్నలిస్టులకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Also Read: DGP Shivdhar Reddy: స్థానిక సంస్థల ఎన్నికలే నా మొదటి ఛాలెంజ్: డీజీపీ శివధర్ రెడ్డి