Akhanda 2 release: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో రాబోతున్న ‘అఖండ 2’ రిలీజ్ డేట్ అఫీషియల్ గా ఫిక్స్ చేశారు నిర్మాతలు. విజయ దశమి సందర్భంగా దీనికి సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య బాబు తాండవం చేస్తూ పవర్ ఫుల్ గా కనిపిస్తారు. విడుదల తేదీ విషయానికొస్తే.. ఈ సినిమా డిసెంబర 5న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై బజ్ ఉంది. 2021లో విడుదలైన అఖండ అప్పుడు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వల్ గా రాబోతున్న అఖండ 2 పై బాలయ్య అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం, ఆధ్యాత్మికత, మంచి-చెడు యుద్ధాల మధ్య ఒక థ్రిల్లింగ్ జర్నీని అందిస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ సారి అయినా విడుదల అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Read also-TG Government Lands: ల్యాండ్ పూలింగ్ పై ప్రభుత్వం ఫోకస్.. పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి!
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్ర ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam). బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం.. బాలయ్య, బోయపాటి నాల్గవసారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. అన్నీ కూడా ‘అఖండ’ మించి ఉంటాయని చిత్రయూనిట్ చెబుతూ వస్తుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.
‘అఖండ 2’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకునేలా, బోయపాటి అత్యద్భుతంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడనే విషయాన్ని ఇప్పటికే విడుదలైన టీజర్ చెప్పకనే చెప్పేసింది. నటసింహం నందమూరి బాాలయ్య కూడా ఈ సినిమాపై యమా కాన్పిడెంట్‌గా ఉన్నారు. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్యకు, ఈ సినిమా కూడా మరో బంపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. బాలయ్య, బోయపాటి అంటే చాలు ఫ్యాన్స్‌కి ఆ మాత్రం నమ్మకం, హైప్, పూనకాలు ఉండనే ఉంటాయి. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్ థమన్ మరోసారి ఈ సినిమా కోసం ఆల్రెడీ డ్యూటీ ఎక్కేసినట్లుగా హింట్ వచ్చేసింది. ఇక థియేటర్లలో వీరంగమే మిగిలి ఉంది.