దర్శకుడు: రిషబ్ శెట్టి
ప్రధాన నటీనటులు: రిషబ్ శెట్టి (బెర్మే / శివ), రుక్మిణి వసంత్ (కనకావతి), గుల్షన్ దేవయ్య (కులశేఖర్), జయరామ్ (రాజశేఖర్), రాకేష్ పూజారి..
సంగీత దర్శకుడు: అజనీష్ లోక్‌నాథ్
నిర్మాత: విజయ్ కిరగందూర్ (హోంబలే ఫిల్మ్స్)
Kantara 1 review: 2022లో విడుదలైన ‘కాంతార’ సినిమా సృష్టించిన సంచలనానికి ప్రీక్వెల్‌గా (కొంతమేరకు సీక్వెల్ కూడా) వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ దసరా రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిషబ్ శెట్టి డైరెక్టర్‌గా, హీరోగా, ప్రొడ్యూసర్‌గా మల్టీ-టాలెంటెడ్ ప్రతిభను ప్రదర్శించిన ఈ చిత్రం. 8వ శతాబ్దం కడంబ రాజవంశ కాలంలో జరిగిన జానపద కథను చిత్రిస్తుంది. మిథాలజికల్ ఎలిమెంట్స్, ట్రైబల్ పోరాటాలు, ధర్మ-అధర్మ ఘర్షణలతో కూడిన యాక్షన్-ఎమోషనల్ డ్రామా. ‘కాంతార’లో శివ (రిషబ్) తండ్రి మాయమైన ప్రదేశం గురించి తెలుసుకునే కథతో మొదలై, ఆ మాయా ప్రదేశం ‘కాంతార’ అనే ప్రాంతం గురించి వివరిస్తుంది. విడుదలకు ముందు అంచనాలు ఆకాశాన్ని అంటినా.. విడుదల తర్వాత ఎలా ఉందో చదివి తెలుసుకుందాం.
Read also-Hyderabad: పండక్కి గోరింటాకు పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే పక్కా షాకవుతారు.. పెద్ద స్కామే ఇది!
కథ
‘కాంతార’ సినిమా ముగింపులో జరిగిన ఘటనలకు ముందుకు వెళ్లి, 8వ శతాబ్దం కడంబ రాజవంశ కాలంలో జరిగే కథ ఇది. దట్టమైన అటవీ ప్రాంతం ‘కాంతార’లో, గిరిజన తెగల మధ్య సుగంధ ద్రవ్యాల (మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క) వ్యాపారం కోసం పోరాటం, ఈశ్వర పూదోట (దైవిక భూమి)ను కాపాడే కథ. బెర్మే (రిషబ్ శెట్టి) అనే దైవ ప్రసాదంగా పుట్టిన గిరిజన నాయకుడు. తన తెగ హక్కుల కోసం బంగ్రా తెగ, రాజు రాజశేఖర్ (జయరామ్), యువరాజు కులశేఖర్ (గుల్షన్ దేవయ్య), యువరాణి కనకావతి (రుక్మిణి వసంత్)లతో పోరాడతాడు. బంగ్రా తెగ కుట్రలు, యువరాణితో ప్రేమాయణం, యుద్ధాలు, శివగణాల రక్షణలు కథనాన్ని ఆకట్టుకున్నాయి. మొత్తంగా సాంప్రదాయాలు, సంస్కృతులు, అధర్మానికి వ్యతిరేకంగా ధర్మ గణాల వస్తున్నారనే థీమ్‌తో ముందుకు సాగుతుంది ఈ సినిమా. మిథాలజికల్ కథలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది. కానీ అందరూ చూడదగిన సినిమా.
ఎవరు ఎలా చేశారంటే..
రిషబ్ శెట్టి: సినిమాకు హైలైట్ అతనే! డైరెక్టర్‌గా, హీరోగా (బెర్మే & శివ డ్యూయల్ రోల్స్), యాక్టర్‌గా మల్టీ-టాలెంటెడ్ ప్రదర్శన. యాక్షన్ సీన్స్‌లో వరాహాలు, ఫారెస్ట్ ఫైట్స్‌లో రౌడీగా మెరిసి, ఎమోషనల్ సీన్స్‌లో లీనమై నటన చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రొమాన్స్ ట్రాక్‌లో కూడా మెప్పించాడు.
రుక్మిణి వసంత్: యువరాణి కనకావతి రోల్‌లో గ్రేస్‌ఫుల్ పెర్ఫార్మెన్స్. రొమాన్స్, ఎమోషన్స్‌లో బాగా మెప్పించింది.
గుల్షన్ దేవయ్య: యువరాజు కులశేఖర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో మెరిసాడు.
జయరామ్: రాజశేఖర్ రోల్‌లో విలన్‌గా పవర్‌ఫుల్. సపోర్టింగ్ కాస్ట్ (రాకేష్ పూజారి, ఇతర ట్రైబల్ ఆర్టిస్టులు) కూడా బాగా సపోర్ట్ చేశారు.
సాంకేతిక అంశాలు
సినిమాటోగ్రఫీ: దట్ట అడవులు, మిస్టీరియస్ లొకేషన్స్, రెయిన్ సీన్స్‌లో అద్భుత విజువల్స్. కర్ణాటక అటవీ ప్రాంతాల్లో షూట్ చేసిన షాట్స్ రియలిస్టిక్‌గా ఉన్నాయి.
సంగీతం : అజనీష్ లోక్‌నాథ్ స్కోర్ సినిమాను ఎలివేట్ చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్, ఎమోషన్ సీన్స్‌లో థ్రిల్ అందిస్తుంది.
ఎడిటింగ్ & వీఎఫ్ఎక్స్: వీఎఫ్ఎక్స్ లో మిథాలజికల్ ఎలిమెంట్స్ బాగా ఇంటిగ్రేట్ అయ్యాయి. కానీ ఎడిటింగ్‌లో కొన్ని ప్లేస్‌లలో టైట్‌గా ఉంటే మరింత మెరుగ్గా ఉండేది.
ప్రొడక్షన్ వాల్యూస్: హోంబలే ఫిల్మ్స్ హై బడ్జెట్‌తో సాంస్కృతిక అంశాలు రియలిస్టిక్‌గా చిత్రీకరించింది.
ప్లస్ పాయింట్స్
రిషబ్ శెట్టి ప్రతిభ: డైరెక్టర్‌గా, హీరోగా, యాక్టర్‌గా మల్టీ-టాలెంటెడ్ పెర్ఫార్మెన్స్. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ సీన్స్‌లో లీనమై అద్భుత నటన కనబరిచారు. బెర్మే క్యారెక్టర్‌కు ఆత్మ ఇచ్చాడు.
సెకండ్ హాఫ్ హైలైట్: హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, భావోద్వేగాలు, ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాలు థ్రిల్ అందిస్తాయి. వరాహాలు, ఫారెస్ట్ ఫైట్స్ విజువల్స్ ఆకట్టుకుంటాయి.
టెక్నికల్ వాల్యూస్: అజనీష్ లోక్‌నాథ్ బీజీఎమ్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. సాంస్కృతిక అంశాలు, మిథాలజికల్ ఎలిమెంట్స్ బాగా ముడిపడ్డాయి.
సపోర్టింగ్ కాస్ట్: రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ పెర్ఫార్మెన్స్‌లు మెప్పించాయి.
Read also-PK comments Prakash Raj: ‘ఓజీ’లో ప్రకాశ్ రాజ్ నటించడంపై క్లారిటీ ఇచ్చిన గంభీరా.. ఎందుకంటే?
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ స్లో: మొదటి అర్ధంలో కథ సెటప్‌కు ఎక్కువ సమయం పడుతుంది, పేస్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది.
అంచనాలకు షార్ట్: కాంతార లాంటి భారీ ఇంపాక్ట్ లేకపోవడం, కొన్ని ప్లాట్ పాయింట్స్ ప్రెడిక్టబుల్‌గా ఉండటం.
లెంగ్త్ ఇష్యూ: 2 గంటల 40 నిమిషాలు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది.
రేటింగ్: 3.5/5
వర్డిక్ట్: కాంతార అభిమానులు తప్పక చూడాల్సిన సినిమా.