Vilaya Thandavam: ప్రస్తుతం ప్రేక్షకులు డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులను అలరించేందుకు ఇప్పుడు ఓ విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రం రెడీ అవుతుందని అంటున్నారు ‘విలయ తాండవం’ (Vilaya Thandavam) మూవీ మేకర్స్. యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు (Karthik Raju), పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ (Jagadeesh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాణం జరుపుకుంటోంది. మందల ధర్మారావు, గుంపు భాస్కర రావు నిర్మిస్తున్న ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా ఫెస్టివల్‌ను పురస్కరించుకుని ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ లాంఛ్ కార్యక్రమానికి ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read- Mass Jathara: ఫైనల్‌గా ‘మాస్ జాతర’ రిలీజ్ ఎప్పుడంటే.. ఆసక్తికర వీడియో వదిలిన మేకర్స్!
టైటిల్ పోస్టర్ అదిరింది
టైటిల్ పోస్టర్ విడుదల అనంతరం ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ‘విలయ తాండవం’ టైటిల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంది. ఈ టైటిల్ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజుకి మరోసారి ఈ చిత్రంతో మంచి పేరు రావాలని, సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. మరో గెస్ట్ భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కార్తీక్ రాజు, నేను తీసిన ‘కౌసల్యా కృష్ణమూర్తి’ చిత్రంలో చాలా బాగా నటించారు. కార్తీక్ ఎప్పుడూ డిఫరెంట్ కథల్నే ఎంచుకుంటూ వైవిధ్యతను చాటుతుంటారు. సినిమా పట్ల ఆయనకు ఎంతో ప్యాషన్ ఉంది. ఈ ‘విలయ తాండవం’తో మరోసారి ఆయనకు మంచి హిట్‌ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైటిల్ పోస్టర్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. కంటెంట్ బేస్డ్ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కాబట్టి.. ఈ ‘విలయ తాండవం’ చిత్రాన్ని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.
Also Read- Avika Gor: ప్రియుడితో ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏడడుగులు.. ఫొటోలు వైరల్
సరికొత్త పాయింట్, కథతో
హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. డైరెక్టర్ వాసు సరికొత్త పాయింట్, కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజర్, ట్రైలర్ వచ్చాక అందరూ ఆశ్చర్యపోతారు. ఈ మూవీలో నేను, పార్వతి, జగదీష్ చాలా ముఖ్యమైన పాత్రలను పోషించాం. నిర్మాతలు నాకు ఫ్యామిలీ మెంబర్లలా మారిపోయారు. ఈ మూవీతో మా అందరికీ పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నానని తెలపగా.., దర్శకుడు వీఎస్ వాసు మాట్లాడుతూ.. మా స్నేహితుడు సంజయ్ వల్లే ఈ మూవీ ప్రయాణం స్టార్ట్ అయింది. నాకు అండగా నిలిచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. మా కోసం ఈ రోజు ఇక్కడకు వచ్చిన గౌర హరి, ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావులకు థాంక్స్. టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన కార్తీక్ రాజుకు, ఇంకా ఇతరులందరికీ థాంక్స్. త్వరలోనే ఈ చిత్ర వివరాలను తెలియజేస్తామని చెప్పారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులకు నిర్మాతలు ధర్మారావు, భాస్కరరావు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని వారు తెలిపారు.
⚔️ When Patience Dies, Rudra Kaali Rises ⚔️
Buckle up for a divine rampage of power and justice! 🔥
It’s #VilayaThandavam 🚨 – Title Poster Unveiled By @AkashJagannadh #BheemaneniSrinivasaRao
The Production No 1 Of #GMRMovieMakers#VSVasu Directorial#MandalaDharmaRao… pic.twitter.com/9BqoK5wVNd
— Sai Satish (@PROSaiSatish) October 1, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు