Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ ప్రీమియర్స్ రద్దు.. కారణమిదే
Kantara Chapter 1
ఎంటర్‌టైన్‌మెంట్

Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ ప్రీమియర్ షోస్ రద్దు.. కారణమిదే!

Kantara Chapter 1: భారీ అంచనాలతో అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమైన ‘కాంతార చాప్టర్-1’ (Kantara: Chapter 1) చిత్రం అభిమానులకు ఊహించని నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా ఏపీలో బుధవారం (అక్టోబర్ 1) రాత్రి జరగాల్సిన ప్రీమియర్ షోలను మేకర్స్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాను విడుదలకు ముందు రోజు చూడాలనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే ఈ సినిమా ప్రీమియర్స్‌ను రద్దు చేయడానికి కారణం లేకపోలేదు. ఇటీవల వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుగానే ప్రీమియర్స్ పడగా, భారీ స్పందన వచ్చింది. టికెట్ల ధరలు ఊహించని రేంజ్‌లో ఉన్నా కూడా ఫ్యాన్స్ అస్సలు ఆగలేదు. థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు. కానీ ‘కాంతార: చాప్టర్ 1’కు మాత్రం ఆ స్కోపు లేకుండా పోయింది. తెలంగాణలో ఎలాగూ అనుమతి లేదు. కనీసం ఏపీలో అయినా ప్రీమియర్స్ పడతాయని మేకర్స్ కూడా భావించారు. కానీ రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే..

Also Read- Allu Sirish: నయనికతో నిశ్చితార్థం.. అధికారికంగా ప్రకటించిన అల్లు శిరీష్

ప్రీమియర్స్ రద్దుకు కారణమిదే..

వాస్తవానికి ఈ సినిమాను ఒక రోజు ముందు అంటే ఈ బుధవారం రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ షోలు వేయాలని ప్లాన్ చేశారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినంతగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చిత్రబృందం తెలిపినట్లుగా ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఒక్క ఏపీలోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా ప్రీమియర్స్ పడటం లేదని తెలుస్తోంది. అందుకు కారణం ఐమ్యాక్స్ స్ర్కీన్ కంటెంట్ అనుకున్న టైమ్‌కి రీచ్ కాకపోవడమే అని అంటున్నారు. మొత్తంగా అయితే ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రదర్శనలు అక్టోబర్ 2వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం కానున్నాయి. ఇక సడెన్‌గా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేయడంతో.. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మనీని రిటన్ చేస్తామని, థియేటర్ల యజమానులు తెలిపినట్లుగా తెలుస్తోంది.

Also Read- Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’కు టికెట్ రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం.. ఎంత పెంచారంటే..?

నిరాశలో అభిమానులు

ఇక ఈ నిర్ణయంతో ప్రీమియర్ షోల కోసం టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు, ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. గతంలో వచ్చిన ‘కాంతార’ (Kantara) చిత్రం అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో, దానికి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్-1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా, దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా అక్టోబర్ 2న (గురువారం) గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రీమియర్స్ రద్దు అయినప్పటికీ, దసరా సెలవులను పురస్కరించుకుని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా, సినిమా విడుదల ముంగిట చివరి నిమిషంలో ప్రీమియర్ షోలు రద్దు కావడం అభిమానుల ఉత్సాహాన్ని కాస్త తగ్గించినా, అక్టోబర్ 2వ తేదీ ఉదయం నుంచి సినిమాను వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. అందుకు చిత్రయూనిట్ ధన్యవాదాలు కూడా తెలిపింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..