Nayanthara Mana Shankara Vara Prasad Garu
ఎంటర్‌టైన్మెంట్

Nayanthara: మన శంకర వరప్రసాద్ గారి శశిరేఖను చూశారా?

Nayanthara: విజయ దశమిని పురస్కరించుకుని, ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మూవీ నుంచి అప్డేట్స్ రాబోతున్నాయని మంగళవారం మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వారు చెప్పినట్లుగానే.. బుధవారం ఉదయం ఒక అప్డేట్‌ను వదిలారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా, హిట్‌ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఇందులో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ‘సైరా, గాడ్ ఫాదర్’ తర్వాత మరోసారి ఆమె చిరుతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ఏమిటంటే.. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి అప్డేట్స్‌తో హడావుడి చేసిన టీమ్.. బుధవారం ఇందులోని నయనతార (Nayanthara) లుక్‌ని రివీల్ చేశారు.

Also Read- Aaryan Teaser: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ టీజర్ ఎలా ఉందంటే..

పండగ తెచ్చేసిన శశిరేఖ

ఈ సినిమాలో నయనతారను ‘శశిరేఖ’ (Sasirekha)గా పరిచయం చేస్తూ, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నయనతార ఇందులో పసుపు రంగు చీరలో కనిపించారు. ముత్యాల హారం, సాంప్రదాయ గాజులతో ఆమె అలంకరణ అద్భుతంగా ఉంది. ఆమె చేతిలో నల్లటి హ్యాండిల్‌తో ఉన్న గొడుగును గమనించవచ్చు. ఆమె వెనుక ఉన్న పూల దండలు చూస్తుంటే.. పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఆమె పాత్ర ఇందులో చాలా హుందాగా ఉంటుందనే విషయం ఈ ఫస్ట్ లుక్‌తో అర్థమవుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో నయనతార పాత్ర చాలా కీలకంగా ఉంటుందనేది కూడా ఈ ఫస్ట్ లుక్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఈ పాత్రకు అనిల్ రావిపూడి పెట్టిన పేరుపై కూడా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. చిరంజీవి అసలు పేరును ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టిన అనిల్ రావిపూడి.. చిరు భార్య పేరు కలిసేలా.. ‘శశిరేఖ’ అని పెట్టడం చూస్తుంటే.. అనిల్ రావిపూడి మాములోడు కాదనేలా టాలీవుడ్‌లో సరదాగా మాట్లాడుకుంటున్నారు.

Also Read- OG New Updates: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ న్యూ అప్డేట్స్.. మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!

గురువారం మరో సర్ ప్రైజ్‌

ఇక ఈ సినిమాకు ఎప్పుడూ లేని విధంగా, నయనతార కూడా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ఆమె ప్రమోషన్స్‌కు రానని ముందే చెప్పేసి, అందుకు తగినట్లుగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే విషయం తెలియంది కాదు. కానీ, ఫస్ట్ టైమ్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె చాలా యాక్టివ్‌గా ముందుంటున్నారు. దీనికి కారణం, అనిల్ రావిపూడి రెడీ చేసిన స్ర్కిప్టే కారణమని అంటున్నారు. ఇక అప్డేట్‌తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను వార్తలలోకి తెచ్చిన మేకర్స్.. విజయదశమి స్పెషల్‌గా గురువారం మరో సర్ ప్రైజ్‌ను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అదేంటనేది చూడాల్సి ఉంది. ఇంతకు ముందు చిరంజీవి ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు, ఇందులో ఆయన చాలా స్టైలిష్ అవతార్‌లో కనిపించారు. నయనతార ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. దీంతో దసరా స్పెషల్‌గా అనిల్ రావిపూడి ఇచ్చే ట్రీట్ కోసం.. మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Republic: ‘రిపబ్లిక్’కు నాలుగేళ్లు.. సాయి దుర్గ తేజ్ ప్రమాదానికి కూడా!

Viral Post: రూ.14 లక్షల జీతంతో కొత్త జాబ్.. చేరిన తొమ్మిదో రోజే యువకుడు రిజైన్.. ఎందుకంటే?

DA increase 2025: దసరాకి ఒక్క రోజు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Parking Problems: జిల్లా కేంద్రంలో పెరుగుతున్న వాహన రాకపోకలు.. పార్కింగ్ లేక అస్తవ్యస్తలు

Kalvakuntla Kavitha: ఈటలపై కవిత ఫైర్.. బీజేపీకి ఆల్టిమేటం జారీ.. స్థానిక ఎన్నికల్లో పోటీపై క్లారిటీ