Idly Kottu review: హీరోగా తన విలక్షణ నటనతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ మరోసారి దర్శకుడిగా ఇడ్లీ కొట్టు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా నిడివి 147 నిమిషాలు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, వెంకట్ ప్రసాద్ కెమెరా. తమిళంలో ‘ఇడ్లీ కడాయ్’గా విడుదలైన ఈ సినిమా తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’గా వచ్చింది.
Read also-Bigg Boss 9 Telugu Promo: తనూజ మూతిపై దాడి.. హోస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. ప్రోమో చూస్తే గూస్ బంప్సే!
కాస్ట్
ధనుష్: మురళి / మురుగన్ (హీరో, దర్శకుడు)
నిత్యా మీనన్: హీరోయిన్ (సపోర్టింగ్ రోల్)
అరుణ్ విజయ్: అశ్విన్ (విలన్)
షాలిని పాండే: మీరా (ధనుష్ ఫియాన్సీ)
సత్యరాజ్: విష్ణువర్ధన్ (ధనుష్ బాస్)
రాజ్ కిరణ్: శివకేశవ (ధనుష్ తండ్రి)
ఇతరులు: సురేఖా వాణి, రామ్య, జీవీ ప్రకాశ్ (స్పెషల్ రోల్స్).
కథ
శంకరాపురం అనే పల్లెటూరిలో శివకేశవ (రాజ్ కిరణ్) ఒక చిన్న ఇడ్లీ కొట్టు నడుపుతుంటాడు. అతని చేసే ఇడ్లీలు చాలా ఫేమస్. కానీ, అతని కొడుకు మురళి (ధనుష్) తండ్రి లాగా ఊరిలోనే ఉండటం ఇష్టం లేక హోటల్ మేనేజ్‌మెంట్ చదువుకుని కుటుంబాన్ని వదిలేసి బ్యాంకాక్ వెళ్లిపోతాడు. అక్కడ అతను పనిచేసే కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలిని పాండే)తో ప్రేమలో పడి, పెళ్లికి సిద్ధమవుతాడు. సరిగ్గా పెళ్లి రెండు మూడు రోజుల ముందు, తండ్రి శివకేశవ చనిపోతాడు. దీంతో మురళి తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. తన తల్లిని పలకరించినప్పుడు, ఆమె అతన్ని గుర్తుపట్టకపోవటం, “ఎవరు బాబు నువ్వు?” అని అడగటంతో అతని గుండె పగిలిపోతుంది. ఇక మురళి తన తండ్రి ఇడ్లీ కొట్టు షాప్‌ను పునరుద్ధరించాలని నిర్ణయిస్తాడు. ఇక్కడే నిత్యా మీనన్ పాత్ర పరిచయమవుతుంది. అతనికి సపోర్ట్ అవుతుంది. మరోవైపు, విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్ (అరుణ్ విజయ్)తో మురళికి తీవ్రమైన ఘర్షణలు ఏర్పడతాయి. ఇంటర్వల్‌కు ముందు ఆ ఘర్షణలు ఉత్కంఠగా ముగుస్తాయి. సెకండ్ హాఫ్‌లో “ఎన్నాళ్లకొచ్చాడే” సాంగ్‌తో ఎమోషన్స్ హైలైట్ అవుతాయి. కథ సీరియస్‌గా మారి, గ్రామస్తుల అండతో మురళి పోరాడుతాడు. అరుణ్ విజయ్ ధనుష్ లైఫ్‌ను డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. చివరికి, కొన్ని కీలక ట్విస్ట్‌ల తర్వాత సుఖాంతంగా ముగుస్తుంది.
పాజిటివ్స్
ధనుష్ పెర్ఫార్మెన్స్: ధనుష్ నటనలో ఎప్పుడులాగే బెస్ట్ ఇస్తాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, సాంగ్స్‌లో మెప్పిస్తాడు. తన చిన్నప్పటి పేదరిక అనుభవాలు రిఫ్లెక్ట్ అయ్యేలా పాత్రలో డెప్త్ ఇచ్చాడు.
ఎమోషనల్ కనెక్షన్: ఫాదర్-సన్ సెంటిమెంట్, కుటుంబ బంధాలు బాగా కనెక్ట్ అవుతాయి. ప్రీ-ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ థ్రిల్ చేస్తాయి.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జీవీ ప్రకాశ్ మ్యూజిక్ సినిమాకు లిఫ్ట్ ఇస్తుంది. “ఎన్నాళ్లకొచ్చాడే” సాంగ్ హైలైట్.
సపోర్టింగ్ కాస్ట్: అరుణ్ విజయ్ విలన్ రోల్‌లో ఫుల్ జస్టిస్ చేశాడు. రాజ్ కిరణ్, సత్యరాజ్ పాత్రలు బాగా సపోర్ట్ చేస్తాయి. పల్లెటూరు బ్యాక్‌డ్రాప్ రిఫ్రెషింగ్‌గా ఉంది.
నెగటివ్స్
పేసింగ్: సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది. స్క్రీన్‌ప్లే మరింత టైట్‌గా ఉంటే మంచిది.
లవ్ ట్రాక్: ధనుష్-నిత్యా మీనన్ మధ్య లవ్ సీన్స్ కనెక్ట్ కాకపోవటం, కొన్ని సన్నివేశాలు క్రింజ్‌గా అనిపిస్తాయి.
స్క్రిప్ట్: కొన్ని భాగాలు ప్రెడిక్టబుల్. షాలిని పాండే పాత్ర అంతంత మాత్రంగా ఉపయోగపడింది.
రేటింగ్: 3/5