Kantara Chapter 1: కర్ణాటక వ్యాప్తంగా తెలుగు సినిమాలపై దారుణంగా ప్రవర్తిస్తున్నా, ఏపీ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా, దానిని సమస్యగా చూడకుండా, కన్నడ చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1)కు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు వెసులుబాటును కల్పించింది. పాన్-ఇండియా స్థాయిలో భారీగా అంచనాలున్న ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) సపోర్టివ్‌గా నిలబడింది. ఒక డబ్బింగ్ చిత్రానికి కూడా టికెట్ల ధరలను పెంచుకోవడానికి వెసులు బాటు కల్పించడం ఇది రెండోసారి. ఇంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాకు కూడా టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఇంకా ‘కాంతార: చాప్టర్ 1’ విడుదల సందర్భంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ.. ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.
Also Read- Dimple Hayathi: పెంపుడు కుక్కల వ్యవహారం.. మరో కాంట్రవర్సీలో డింపుల్ హయాతి!
టికెట్ ధరలు పెంచుతూ జీవో విడుదల
ఈ జీవో ప్రకారం అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు, అంటే మొత్తం పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం సినిమా యూనిట్‌తో పాటు, కన్నడ సినీ పరిశ్రమ వర్గాలకు, ఏపీలో విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఊరటనిచ్చింది. ఇక ఈ సినిమాకు పెరిగిన టికెట్ల ధరల వివరాలకు వస్తే.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ. 75, మల్టీప్లెక్స్ థియేటర్లలో అదనంగా రూ. 100 పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాణ వ్యయం, సినిమా స్థాయి, పాన్-ఇండియా రిలీజ్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ పెంపునకు అనుమతి ఇచ్చినట్లుగా ఏపీ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. టికెట్ ధరల పెంపు నిమిత్తం ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా బృందం సోమవారం ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసింది. వారి వినతిని పరిశీలించిన ప్రభుత్వం, సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఈ జీవోను విడుదల చేయడం విశేషం.
Also Read- Pre Wedding Show: మొన్న ‘వైరల్ వయ్యారి’.. ఇప్పుడు ‘వయ్యారి వయ్యారి’.. మరో క్యాచీ లవ్ సాంగ్
అంచనాలు తారాస్థాయిలో
దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) నుంచి వస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తొలి భాగం ‘కాంతార’ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో, ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’ కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టికెట్ ధరల పెంపు, కలెక్షన్స్‌కు మరింత దోహదపడుతుందని చిత్రయూనిట్ భావిస్తూ.. ఏపీ ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసింది. రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ముఖ్య అతిథిగా హాజరై.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని, అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు