Dimple Hayathi controversy
ఎంటర్‌టైన్మెంట్

Dimple Hayathi: పెంపుడు కుక్కల వ్యవహారం.. మరో కాంట్రవర్సీలో డింపుల్ హయాతి!

Dimple Hayathi: డింపుల్ హయాతి.. ఈ హీరోయిన్ సినిమాల క‌ంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తోంది. ఆ మధ్య డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవపడి, కేసుల వరకు వెళ్లిన డింపుల్.. ఆ తర్వాత వేణు స్వామితో పూజలు చేయించుకుంటూ మరోసారి వార్తలలో నిలిచింది. ఇక ఇవన్నీ కాకుండా.. సోషల్ మీడియాను హీటెక్కించేలా హాట్ హాట్ ఫొటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తూ ఉండేది. ఈ మధ్య కాస్త తగ్గించింది కానీ, ఇంతకు ముందు ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉండేవి. ఇప్పుడేదో పెళ్లి చేసుందనే వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి.. ఆ హీట్‌ని ఏమైనా పక్కన పెట్టిందేమో.. సరే ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఆమె మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ కాంట్రవర్సీకి సంబంధించి ఆమె పేరు మరోసారి వార్తలలో ప్రధానంగా హైలెట్ అవుతోంది. అసలు విషయంలోకి వెళితే..

Also Read- Pre Wedding Show: మొన్న ‘వైరల్ వయ్యారి’.. ఇప్పుడు ‘వయ్యారి వయ్యారి’.. మరో క్యాచీ లవ్ సాంగ్

మీరెంత.. మీ బ్రతుకులెంత!

తాజాగా వివాదానికి సంబంధించి ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆమె భర్త తమ పెంపుడు కుక్కలను చూసుకోవడానికి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువతులను నియమించుకున్నారట. రెండు రోజులు బాగానే వారిని చూసుకున్నారట. ఆ తర్వాతే వారిని హింసించడం, దూషించడం వంటివి చేస్తున్నారని, ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా వెళ్లగొట్టారని ఈ వాయిస్‌లో చెబుతున్నారు. అంతే కాదు, ఆ ఇద్దరు యువతులు డింపుల్ హయాతి ఉంటున్న అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న రోడ్డుపైనే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. ఇప్పటి వరకు పని చేయించుకున్నందుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా.. బలవంతంగా పనులు చేయించుకున్నారని, ‘మీరెంత.. మీ బ్రతుకులెంత.. నా చెప్పుల ఖరీదు కూడా చేయరు’ అంటూ డింపుల్ భర్త దూషిస్తే.. ‘నా భర్త లాయర్, మీరు నన్ను ఏమీ పీ*లేరు’ అంటూ.. హీరోయిన్ డింపుల్ హయాతి వారిని బెదిరించినట్లుగా ఈ వీడియోలో ఆరోపణలు చేస్తున్నారు.

Also Read- Mahakali: ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ ‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా ఎవరంటే?

ఇంత దారుణమా..

ఇక ఇద్దరు యువతులను రోడ్డుపై అలా చూస్తుంటే.. వాళ్లను ఇడ్చి అక్కడ పడేసినట్లుగా అనిపిస్తుంది. వారి సామాన్లు కూడా చెల్లాచెదురుగా పడివున్నాయి. మరి దీనిపై ఎవరైనా యాక్షన్ తీసుకుంటారో లేదో తెలియదు కానీ, మరి ఇంత దారుణంగా ఓ సెలబ్రిటీ ప్రవర్తించడం అనేది మాత్రం ఈ మధ్యకాలంలో అయితే జరగలేదు. చూద్దాం మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో. ఇదిలా ఉంటే, అసలు డింపుల్ హయాతి పెళ్లి ఎప్పుడు చేసుకుందనేది మాత్రం క్లారిటీనే లేదు. ఈ మధ్య ఓ వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. బిజినెస్ మ్యాన్‌తో ఆమె ప్రేమాయణం నడుపుతుందని, ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పారనేలా వార్తలు అయితే వచ్చాయి కానీ, పెళ్లి విషయమై ఎలాంటి వార్త బయటకు రాలేదు. కట్ చేస్తే.. ఈ వీడియోలో తన భర్త లాయర్ అని డింపుల్ చెప్పినట్లుగా సదరు మహిళ చెబుతుంది. చూస్తుంటే.. ఇదేదో పెద్ద వ్యవహారంలాగానే అనిపిస్తుంది. చూద్దాం.. పైనల్‌గా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Akhanda2 3D Release: 3డీలో రాబోతున్న బాలయ్య బాబు ‘అఖండ 2 తాండవం’.. ఇక ఫ్యాన్సుకు పూనకాలే..

Paddy Harvest Delay: ఇనుగుర్తి మండలంలో రైతుల ఇక్కట్లు.. ప్రారంభం కాని వరి కోతలు..!

Delhi Blast Probe: బాంబు పేలుడుకు ముందు ఉమర్ ఎక్కడ నివసించాడో కనిపెట్టిన ఇన్వెస్టిగేషన్ అధికారులు

Shiva Re-Release: నాగార్జున ‘శివ’ రెండు రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. రీ రిలీజ్‌కు ఇంత క్రేజా..

Minister Vakiti Srihari: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం 123 కోట్లు: మంత్రి వాకిటి శ్రీహరి