Jupally Krishna Rao: మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సవాల్ చేశారు. నేను మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదోనని మాట్లాడనని కేటీఆర్ మాట్లాడుతున్నారని.. ఆయన వ్యాఖ్యల్లో పసలేదని.. అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. దానిపై చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు.. నేను మీడియాతో వస్తానని నేడు..రేపు.. ఎల్లుండి ఎప్పుడు.. ఎక్కడికి రావాలో చెప్పాలని.. అక్కడి వస్తానని సవాల్ చేశారు. నువ్వుచేసిన వ్యాఖ్యలు వాస్తవని తేలితే ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. కేటీఆర్ కు నిజం మాట్లాడే దైర్యం ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ లో 7 సార్లు పోటీ చేసి 6 సార్లు విజయం సాధించానని, ఎప్పుడు హామీలు ఇవ్వలేదని.. అభివృద్ధి పనులు నిరంతరం చేసుకుంటూ పోతానని.. ప్రజలకు ఏం కావాలో అది చేస్తానని.. అది నావిశ్వసనీయత అని పేర్కొన్నారు. తాను మాటమార్చను.. అబద్దాలు చెప్పనన్నారు.. హామీలు ఇవ్వనన్నారు.
Also Read: OTT Movie: ఒంటరితనానికి గురైన చిన్నారి.. ఆ రహస్యం కోసం ఏం చేశాడంటే?
రాజకీయ లబ్దికోసమే కేటీఆర్ ప్రయత్నమంతా
అభివృద్ధి మాత్రం చేసి చూపుతానన్నారు. రవీంద్రభారతిలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం తప్పుడు హామీలు, మాటలు, అబద్దాలతో కేటీఆర్ రాజకీయ పబ్బంగడుపుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్దికోసమే కేటీఆర్ ప్రయత్నమంతా అన్నారు. రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములయ్యారని బీఆర్ఎస్ కు ప్రజలు అవకాశం ఇస్తే..ప్రజల విశ్వసనీయత కోల్పోయారన్నారు. నైతిక విలువలు వారికి లేవన్నారు. మాటల మనుషులు కారని ప్రజలు భావించి 2023 ఎన్నికల్లో ఓడించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ ఖూనీ చేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు.
10లక్షలకోట్లు ప్రజలపై భారం
నాడు ధనిక రాష్ట్రంను బీఆర్ఎస్ కు ప్రజలు అప్పగిస్తే 8లక్షలకోట్లు పదేళ్లలో అప్పుచేశారని, ఆ అప్పుకు 20 నెలల్లో 2లక్షల కోట్లు వడ్డీ చెల్లించామన్నారు. మొత్తం 10లక్షలకోట్లు ప్రజలపై భారం వేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 3లక్షలు అప్పు వేసిందని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాలు భూమి ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, డబుల్ బెడ్రూం ఇవ్వలేదని, ప్రజలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ఆరుగ్యారెంటీల్లో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, రేషన్ దుకాణాలతో సన్నబియ్యం పంపిణీచేస్తున్నామని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ 90వేల కోట్లు ఖర్చు
వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టు, రాష్ట్ర అప్పులపై బహిరంగచర్చకు సిద్దమా? అని కేటీఆర్ కు సవాల్ చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ఖర్చుచేసిందే 30వేలకోట్లు అన్నారు. ఇంకా 40వేల కోట్ల ఖర్చుచేస్తేనే ప్రాజెక్టుకు కంప్లీట్ అవుతుందన్నారు. కెనాల్ కు అడ్మినిస్ట్రేషన్ మంజూరు లేదని.. నిధులు ఖర్చు చేయకుండా 90శాతం ఎలా ప్రాజెక్టును పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ 90వేల కోట్లు ఖర్చుచేసి పూర్తి చేశారని, కానీ పాలమూరును పదేళ్లు వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజలాలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. తెలంగాణకు 299టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు ఒప్పుకుని నష్టం చేసింది చాలక ఇప్పుడు అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాపై పోరాటం చేస్తున్నామన్నారు. చట్టపరంగా ముందుకు పోతున్నామని వెల్లడించారు. దేశచరిత్రలో ఏ మంత్రి వాదించని విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రిబ్యూనల్ లో పాల్గొని నీటివాటాలపై మాట్లాడారన్నారు.
టూరిజంలో అవినీతి చేయడానికి కేసీఆర్ నా? హరీష్ రావునా?
కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. రేవంత్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పంజావిసిరితే బీఆర్ఎస్ ఓటమిపాలైందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మరోసారి పంజావిసురనున్నారని, అప్పుడు ఆయన సత్తా ఏంటో మరోసారి కేటీఆర్ కు తెలియజేయడం జరుతుందన్నారు. ఆల్మట్టి విషయంలో చట్టపరంగా నిబద్ధతతో ధర్మాన్ని నిర్వరిస్తున్నామన్నారు. ఎవరికి అనుమానాలు అవసరం లేదన్నారు. టూరిజంలో అవినీతి చేయడానికి కేసీఆర్ నా? హరీష్ రావునా? అని ఎద్దేవా చేశారు. నూరుశాతం చట్టప్రకారం ముందుకు పోతున్నామన్నారు. మూసి ప్రక్షాళన చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కోటి 40లక్షల జనాభా నుంచి మూసి వరదల నుంచి బయటపడేయాల్సిందేనన్నారు. 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పేదల పార్టీ.. ఇందిరమ్మ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. అబద్దాల మీద బతుకడం కేటీఆర్ కు అలవాటు అని మండిపడ్డారు.
Also Read: Sasivadane trailer: ప్రేమిస్తే యుద్ధం తప్పదా!.. అది తెలియాలంటే ఈ ట్రైలర్ చూసేయండి..