Bathukamma-Guinness-Record
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Bathukamma Record: బతుకమ్మకు రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు

Bathukamma Record: బతుకమ్మకు రెండు వరల్డ్ గిన్నీస్ బుక్ రికార్డులు

63.11 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు బతుకమ్మకు మొదటి రికార్డు
అధిక సంఖ్యలో మహిళలు బతుకమ్మ ఆడినందుకు మరో గుర్తింపు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మిస్ వరల్డ్ ఓప‌ల్ సుచాత

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకమైన బతుకమ్మ కు ఎట్టకేలకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో (Bathukamma Guinness Record) రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. పూలను, ప్రకృతిని పూజిస్తూ కొనసాగే బతుకమ్మ ఆటపాటకు ఈ సారి వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించాలన్న లక్ష్యంతో జీహెచ్ఎంసీ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృృతి శాఖ చేసి కృషి ఫలించాయి. సోమవారం సరూర్ నగర్ స్టేడియంలో మెగా బతుకమ్మ గ్రాండ్ ఈవెంట్ జరిగింది. 63.11 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పుతో భారీ బతుకమ్మను తీర్చిదిద్దగా దానికి మొదటి రికార్డు దక్కింది. ఇక దాని చుట్టూ ఒకేసారి 1,340 మందితో నిర్వహించిన బతుకమ్మ ఆటపాట రెండవ రికార్డు సాధించింది. ఒక బతుకమ్మ చుట్టూ ఇంతమంది ఒకేసారి ఆడిపాడడం ఇదే తొలిసారి.

ఈ మెగా బతుకమ్మ కార్యక్రమానికి మిస్ వరల్డ్ ఓప‌ల్ సుచాత, కాంటినెంటల్ మిస్ వరల్డ్ ప్రతినిధి బృందం హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి హాజరయ్యి, ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల పత్రాలను స్వీకరించారు. బతుకమ్మ పండుగ మొదలు కాకముందు నుంచే గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా ప్రభుత్వ శాఖలు చక్కటి సమన్వయంతో ప్రణాళికాబద్ధం పనిచేశాయి. అందరికీ బతుకునిచ్చే బతుకమ్మను మరోసారి విశ్వవ్యాప్తం చేశారు. సాంస్కృతిక, పర్యాటక శాఖతో పాటు జనసమీకరణ చేసి, మహిళలందరూ లయబద్దంగా ఒకేలా పాడుతూ ఆడే విధంగా వారికి రిహార్సల్ నిర్వహించి, గ్రాండ్ ఈవెంట్‌ను సక్సెస్ చేసి, బతుకమ్మ రెండు గిన్నీస్ రికార్డులు పొందేలా కృషి చేసినవారందరికీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క అభినందలు తెలిపారు. బతుకమ్మ పండుగ పరమార్థం మహిళా సాధికారత, సమాజ సాధికారత అని అన్నారు. మహిళలు క్షేమంగా, ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే కుటుంబాలు, సమాజం, రాష్ట్రం, దేశం బాగుంటాయని మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఎండీ వల్లూరి క్రాంతి, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (యూసీడీ) ఎస్.పంకజతో పాటు కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు.

Read Also- Tariff on Movies: సినీ ఇండస్ట్రీకి ట్రంప్ షాక్.. సినిమాలపై 100 శాతం టారిఫ్ విధింపు

రికార్డుల వివరాలు ఇవే

మెగా బతుకమ్మ గ్రాండ్ ఈవెంట్‌గా 1,340 మందితో నిర్వహించిన సామూహిక బతుకమ్మ ఒక రికార్డ్ సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 11 వెడల్పు, 63.11 అడుగుల ఎత్తులో ఏడు వేల టన్నుల రకరకాల సహజసిద్ధమైన పూలతో ప్రత్యేక అలంకరణగా పేర్చిన బతుకమ్మ బ‌యోడిగ్రెడ‌బుల్ బ‌తుక‌మ్మ‌ రూపంలో మరో రికార్డు సొంతమైంది. లేని విధంగా 1340 మంది మహిళలు లయబద్దంగా, అందరూ ఒకే రకంగా బతుకమ్మ ఆడిన అరుదైన ఈవెంట్‌కు గాను రెండో గిన్నీస్ బుక్ రికార్డు కూడా దక్కించుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

సమిష్టి కృషితోనే సాధ్యం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మకు రెండు వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు దక్కటం గర్వకారణంగా ఉందని, ఇది జీహెచ్ఎంసీ, టూరిజం, కల్చరల్ విభాగాల సమష్టి కృషితోనే సాధ్యమైందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మకు విశ్వవ్యాప్తంగా అరుదైన గుర్తింపు తీసుకువచ్చేందుకు నగరం నలుమూలల నుంచి వచ్చిన మహిళలే ఈ రికార్డు సాధనలో కీలక పాత్ర పోషించారని మేయర్ అభినందించారు.

Read Also- POK Protests: పీవోకేలో కల్లోలం.. సామాన్యులపై ఆర్మీ, ఐఎస్ఐ కాల్పులు.. ఇద్దరు మృతి

Just In

01

Karnataka 1: ‘కాంతారా ఛాప్టర్ – 1’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏపీ డిప్యూటీ సీఎం స్పందన

Election Code: తనిఖీలు షురూ… అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. రూల్స్ ఇవే

Investment Fraud: భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి.. నిండా ముంచారు!

OTT Movie: ఒంటరితనానికి గురైన చిన్నారి.. ఆ రహస్యం కోసం ఏం చేశాడంటే?

OTT Movie: విడిపోయిన ప్రేమ జంట అనూహ్యంగా అలా పట్టుబడితే.. ఏం చేశారంటే?