Mallareddy to join tdp
Politics, Top Stories

Hyderabad:మల్లన్న ‘తెలుగు’గానం!!

  • తెలుగుదేశం పార్టీలో మల్లారెడ్డి చేరనున్నారని జోరుగా ప్రచారం
  • తెలంగాణలో ఏపీ మాదిరిగా టీడీపీ పుంజుకుంటుందని ఊహలు
  • బీజేపీ, కాంగ్రెస్ తిరస్కరించడంతో టీడీపీ వైపు మొగ్గు
  • తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న మల్లారెడ్డి
  • చంద్రబాబును అడ్డం పెట్టుకుని ఆస్తులు కాపాడుకునే యత్నం
  • బీఆర్ఎస్ ను నమ్ముకుంటే లాభం లేదని భావన
  • బాబు ప్రమాణ స్వీకారం తర్వాత భేటీ అయ్యే ఛాన్స్
  • మల్లారెడ్డి సొంత మీడియాలోనే కథనాలు
  • ఖండించని మల్లారెడ్డి అనుచర గణం

Mallareddy decide to change into TDP sensational news halchal:

చామకూర మల్లారెడ్డి ఈ పేరంటేనే తెలంగాణలో ఓ సంచలనం. నవ్వుతూ మాట్లాడుతూనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారతారని తెగ ప్రచారం జరిగింది. అయితే అట్లాంటిదేమీ లేదని తెగేసి చెప్పిన మల్లారెడ్డి పార్టీ మారతారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. అయితే అదేదో పార్టీ కాదు. రాష్ట్రంలో ఊసులేకుండా పోయిన తెలుగు దేశం పార్టీకి తెలంగాణ అధ్యక్షుడిగా చేయాలని చంద్రబాబునుంచే కబురు వచ్చిందని సమాచారం. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మల్లారెడ్డిని కాదనుకోవడంతో తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

తెలంగాణలో టీడీపీ ఉనికిని కాపాడుకునే యత్నం

ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఏపీలో టీడీపీ భారీగా పుంజుకుని కేంద్రంలోనూ చక్రం తిప్పే స్థితికి వచ్చింది. చంద్రబాబుకు జాతీయ నేతగా మంచి గుర్తింపు లభించింది. ఇకపై తెలంగాణలోనూ తెలుగుదేశం ఉనికిని కాపాడుకోవడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు సమాచారం. తెలుగు దేశం పార్టీ రమ్మంటోంది..తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తానంటున్నారు..? పోతే ఏలా ఉంటుందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సొంత ఆస్తులను కాపాడుకోవడంతో పాటు రాజకీయంగా అధిపత్యాన్ని కాపాడుకునేందుకు మల్లారెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆయన అనుచర గణం పేర్కొంటోంది.

తెలంగాణలోనూ టీడీపీ పుంజుకుంటుందని..

ఏపీలో రాజకీయ మార్పులు వచ్చి తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వచ్చినట్లే తెలంగాణలోనూ వచ్చే ఎన్నికలలో పుంజుకుంటుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడి అండతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చి, తన విద్యా సంస్థలపై దాడులను అరికట్టాలని, కేంద్రంలో తన పనులను చక్క బెట్టుకోవాలని చూస్తున్నట్లు మల్లారెడ్డి సన్నిహితులే పేర్కొంటున్నారు. పైగా మల్లారెడ్డి టీడీపీ నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు దేశం పార్టీ తరపున మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి 2014లో విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం.. పార్టీ చతికిల పడడంతో మల్లారెడ్డి 2016 లో కారెక్కారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలుపొంది కార్మిక శాఖ మంత్రి అయ్యారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కొల్పోవడంతో మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి.

ఖండించని మల్లారెడ్డి

తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంతో మల్లారెడ్డి ఈ పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నందున అధ్యక్ష పదవిని పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్లుతున్నట్లు తన అనుకూల సోషల్ మీడియాతో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దాన్ని మల్లారెడ్డి అధికారికంగా ఖండించకపోవడం కూడా గమనార్హం. ఒకవేళ మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించకపోతే పత్రిక ముఖంగా కానీ, సోషల్ మీడియా వేదికగా కానీ ఖండించేవారని పోలిటీకల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.

Just In

01

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే

Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో 2 లక్షల 54 వేల 685 విగ్రహాలు నిమజ్జనం.. జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడి

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు