Seethakka (IMAGE credit: swetcha reporter)
తెలంగాణ, నార్త్ తెలంగాణ

Seethakka: విద్యా రంగంలో కొత్త అధ్యాయం.. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ.. ఏర్పాటు అక్కడే?

Seethakka: యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉన్నత విద్యా అవకాశాలు అందుతాయని, విద్యా రంగంలో కొత్త అధ్యాయం సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ (Sammakka Saralamma Central Tribal University ) సృష్టిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క (Seethakka) అన్నారు.  జిల్లా కేంద్రం లో జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్ రోడ్ వద్ద సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ విశ్వవిద్యాలయం కోసం 24 కోట్ల నిధులతో 8.4 కిలోమీటర్ల సమ్మేళనం గోడ నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జి నాగేష్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వం ఎల్లప్పుడూ గిరిజన సంక్షేమం పట్ల కట్టుబడి ఉంది

ఈ సందర్భంగా మంత్రి సీతక్క ((Seethakka)) మాట్లాడుతూ సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ములుగు జిల్లాకు ప్రత్యేక గౌరవ లభిస్తుందని, గిరిజన విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఇది బలమైన వేదిక అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ గిరిజన సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక వసతులను సమకూర్చుతామని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉన్నత విద్యా అవకాశాలు అందుతాయని, విద్యా రంగంలో కొత్త అధ్యాయం సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ సృష్టిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఆధునిక లైబ్రరీలు, ల్యాబరేటరీలు, హాస్టల్స్, తరగతి గదులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

 Also Read: Telangana Govt: ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు.. ఈసారి 8,332 కేంద్రాలు.. బోనస్ ఎంత అంటే?

విద్యా రంగంలో కొత్త మైలురాయి

స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు వల్ల విద్యా రంగం, జిల్లా అభివృద్ధికి సహకారం ఏర్పడుతుందని విద్యార్థులు, యువత, స్థానికులు అందరూ ఈ యూనివర్సిటీ ద్వారా అద్భుత ఫలితాలను రాణిస్తారన్నారు. ప్రజా ప్రభుత్వం గిరిజన సంక్షేమం, విద్యా అవకాశాలను ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, యూనివర్సిటీ ఏర్పాటు ములుగు జిల్లాకు గౌరవాన్ని కలిగించడమే కాక, విద్యా రంగంలో కొత్త మైలురాయిని సృష్టిస్తుందన్నారు.

80 శాతం స్థానిక విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు

ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు కాబోతున్న సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీలో 80 శాతం స్థానిక విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు కల్పించడం జరుగుతుందని యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ప్రాంతీయ ప్రతిభను వెలికి తీయడానికి ముఖ్యమైన వేదికగా మారుతుందని తెలిపారు. స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గిరిజన యూనివర్సిటీ అన్ని అవకాశాలు అందుబాటులో వస్తాయని అన్నారు. అన్ని హంగులతో ఆధునిక లైబ్రరీలు, ల్యాబరేటరీలు, హాస్టల్స్, తరగతి గదులు ఏర్పాటుచేసి విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ద్వారా, యువత సుస్థిరమైన భవిష్యత్తుకు పునాది వేసినట్లు అవుతుందని సమాజానికి, జిల్లా అభివృద్ధికి, మరియు గిరిజన సంక్షేమానికి అభివృద్ధిలో మార్గదర్శిగా నిలుస్తుందని అన్నారు.

24 కోట్ల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు జి నాగేష్ మాట్లాడుతూ 24 కోట్ల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలోని గిరిజనుల విద్యాభివృద్ధి కోసం వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసేలా, ఆర్థిక అభివృద్ధిలో కూడా యూనివర్సిటీ ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. త్వరలోనే క్యాంపస్ నిర్మాణం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని , కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో యూనివర్సిటీ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసినందుకు దేశ ప్రధాని, స్థానిక కేంద్ర మంత్రులు బండి సంజయ్, (Bandi Sanjay) కిషన్ రెడ్డి(Kishan Reddy)లకు ధన్యవాదాలు తెలియజేశారు. యూనివర్సిటీ వేగవంతంగా ఏర్పాటు చేసే విషయంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ తో కలిసి ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు.

ఇతర రాష్ట్రాల గిరిజన విద్యార్థులు కూడా ఇక్కడ యూనివర్సిటీలో ప్రవేశాలు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ (Sammakka Saralamma Central Tribal University)లో రాబోయే ఐదు సంవత్సరాలలో 3000 నుంచి 5000 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించనున్నారని అన్నారు. టాస్క్ సెంటర్ ద్వారా కూడా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి పెంచే విధంగా చూస్తున్నామని పేర్కొన్నారు. సెంట్రల్ గిరిజన యూనివర్సిటీలో ప్రస్తుతానికి 42 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, కేంద్ర ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని ఇతర రాష్ట్రాల గిరిజన విద్యార్థులు కూడా ఇక్కడ యూనివర్సిటీలో ప్రవేశాలు పొందడం జరిగిందని తెలిపారు.

శ్రీ సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ కి కేర్ టేకర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కు అదనపు బాధ్యతలు అందించడం జరిగిందని తద్వారా యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో పనులు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారామ్ నాయక్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Ind-Pak Toss Update: ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. టాస్ గెలిచిన భారత్.. జట్టులో కీలక మార్పు

Just In

01

Crime News: చికెన్ కూర కావాలని అడిగినందుకు.. 7 ఏళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తల్లి

Crime News: కొడుక్కి 18 ఏళ్లు నిండడానికి ఒక్క రోజు ముందు.. తండ్రి పక్కా ప్లాన్

Rural Health Care: పండుగకు తాళం వేసిన పల్లె దవాఖానలు.. రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారా..?

NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పథకం గురించి తెలుసా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ భారీ బడ్జెట్ సినిమా స్టార్ట్.. విలన్ ఎవరంటే?