Local Body Elections: రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి స్థానిక సంస్థల (Local Body Elections) ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్(State Election Commission) కూడా ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఆటోమెటిక్ గా కోడ్ అమల్లోకి వస్తుంది. అయితే ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక బీసీలకు 42 శాతం అంశంపై హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది.
వచ్చే నెల 8న తదుపరి విచారణ జరగనున్నది. వాయిదా వేసుకోవాలని కోర్టు సూచించినప్పటికీ, ప్రభుత్వం ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఎలాంటి స్టే ఇవ్వకపోవడంతో 42 శాతం రిజర్వేషన్లతో నే ముందుకు సాగాలని సర్కార్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఎక్స్ పర్ట్స్, లీగల్ టీమ్స్ తో ప్రభుత్వం డిస్కషన్ చేసింది. రిజర్వేషన్ల అంశం పై కోర్టు లో డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది? న్యాయ పరమైన చిక్కులు ఏముంటాయి? ఎలా ఎదుర్కొవచ్చు? అనే అంశాలను చర్చించి పకడ్భందీగా ప్రణాళికలు ఫిక్స్ చేసినట్లు తెలుస్తున్నది. అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా పంచాయితీ రాజ్ శాఖ అలర్ట్ చేసినట్లు సమాచారం.
Also Read: Telangana Agriculture: రైతు కుటుంబాలకు సరిగ్గా తెలియని విషయమిదీ.. రూ.5 లక్షలు వస్తాయ్
రిజర్వేషన్లు అమలైతే 23 వేల పదవులు అదనం..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో అదనంగా 23,973 పదవులు దక్కనున్నాయని అధికారుల అంచనా.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడం వల్ల బీసీలు స్థానిక సంస్థల్లో 13,346 పదవులు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 42% రిజర్వేషన్ల ద్వారా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా మొదలుకొని జెడ్పీ ఛైర్మన్ల వరకు బీసీలకు అదనంగా అక్షరాల 23,973 పదవులు దక్కనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. తాజాగా ఖరారైనా జెడ్పీ ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లలో బీసీలకు 13 దక్కడం గమనార్హం.ఇలా మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 55,624 పదవులు వరించనున్నాయని తెలుస్తోంది.
ఆర్డినెన్స్, బిల్లులు తెచ్చినా…నో అప్రూవల్..
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన ద్వారా సేకరించిన వివరాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేక బిల్లులు, ఆర్డినెన్స్‌లు, చట్ట సవరణలు చేసి చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఎంత కృషి చేసినా గవర్నర్, రాష్ట్రపతి వద్ద అవి పెండిగ్‌లో ఉన్న పరిస్థితి. అయితే, ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక జీవోను తీసుకొచ్చింది.
దీంతో ఎంపీడీవో మొదలుకొని పంజాయతీరాజ్ కమిషనర్ వరకు రిజర్వేషన్ల ఖరారులో తలమునకలైన అధికారుల లెక్కల్లో బీసీలకు పెరిగే స్థానాలపై కొంతమేర స్పష్టత వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,751 సర్పంచ్ పదవుల్లో బీసీలకు పెంచిన 42 శాతం రిజర్వేషన్ల మేరకు 5,355 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక 1.11 లక్షల గ్రామ పంచాయతీ వార్డు స్థానాల్లో 46,965 పదవులు, అర్బన్ వార్డుల్లో 3,385 స్థానాలకుగానూ 1,422 లభించనున్నాయి. మరోవైపు 5,773 ఎంపీటీసీ స్థానాల్లో2,425 బీసీలకు దక్కే ఛాన్స్ ఉంది. ఇక చెరో 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు చెరో 238 స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: Toilet Habits: టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే, ఆ ప్రాణాంతక సమస్య రావడం పక్కా!