Jatadhara: నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu), బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలలో నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘జటాధర’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడానికి రెడీ అవుతోన్న ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ పవర్ ఫుల్ అప్డేట్‌ని వదిలారు. అదేందంటే..
ధన పిశాచి సాంగ్ వస్తోంది
ఇటీవల రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్‌గా వైరల్ అయ్యింది. అలాగే ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధార’ అద్భుతమైన స్పందనను రాబట్టుకోగా.. విజయదశమి కానుకగా ఈ సినిమా నుంచి అక్టోబర్ 1న ‘ధన పిశాచి’ అనే సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవడమే కాకుండా, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది. ఆ రేంజ్‌లో ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఉంది. ఈ విజువల్ స్పెక్టకిల్ చిత్రాన్ని 7 నవంబర్, 2025న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
భారీగా అంచనాలు పెరిగాయి
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని వంటి వారంతా నటిస్తున్న ఈ సినిమా మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి– విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని చూపించబోతుందనే విషయం ఇప్పటికే వచ్చిన టీజర్ తెలియజేసింది. అలాగే ‘సోల్ ఆఫ్ జటాధర’ కూడా సినిమాలోని డివోషనల్ టచ్ ఏంటనేది తెలియజేసింది. మొత్తంగా అయితే ఈ సినిమాపై అటు బాలీవుడ్‌లోనే కాకుండా, ఇటు టాలీవుడ్‌లోనూ భారీగా అంచనాలు పెరిగాయి. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భావిని గోస్వామి సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్‌గా ఉన్న ఈ సినిమాకి పవర్ ఫుల్ సౌండ్‌స్కేప్‌ను జీ మ్యూజిక్ కో అందిస్తోంది. ఈ సినిమా సుధీర్ బాబు కెరీర్‌కు ఎంతో కీలకంగా మారింది. ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ కొడతానని ధీమాగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు