Bathukamma-Kunta
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Bathukamma Kunta: బతుకమ్మకుంట ప్రారంభం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Bathukamma Kunta: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం (సెప్టెంబర్ 28) బతుకమ్మకుంటను (Bathukamma Kunta) ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ నిన్నటి వరకు కబ్జాకోరల్లో చిక్కి, కుంచించుకుపోయి, తన అస్థిత్వమే ప్రశ్నార్ధకమైన అంబర్ పేట బతుకమ్మ కుంట నేడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. జలకళతో జీవకళను అలుముకుంది. తన అలలపై ఆడబిడ్డల బతుకమ్మల ఒయలు ప్రదర్శిస్తూ గత వైభవాన్ని తిరిగి సాధించుకుంది. హైదరాబాద్ మహానగరంలో కబ్జా కోరల్లో చిక్కి అస్థిత్వం కోల్పోయే ప్రమాదంలో ఉన్న ప్రతి చెరువును తిరిగి పునరుద్ధరిస్తాం. లేక్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దుతాం. దానికి ఈ రోజు ప్రారంభించుకున్న బతుకమ్మకుంట తొలి అడుగు’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Read Also- Ind Vs Pak Final: అదరగొట్టిన బౌలర్లు.. పాకిస్థాన్ ఆలౌట్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్!

కాగా, ఇంతకాలం ఆక్రమణలకు గురైన బతుకమ్మ కుంట హైడ్రా వచ్చాక పునరుజ్జీవనం పోసుకుంది. 7 కోట్ల 40 లక్షల రూపాయలతో బతుకమ్మ కుంట సుందరీకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 5 ఎకరాల 15 గుంటల స్థలంలో బతుకమ్మ కుంట పేరుతో వర్టికల్​ గార్డెన్​‌ను అధికారులు ఏర్పాటు చేశారు. బతుకమ్మ కుంట చుట్టూ చెట్లు నాటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చిల్డ్రన్​ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరంలోని ప్రతి చెరువును ఆక్రమణల నుంచి విడిపించి, వాటిని పునరుద్ధరిస్తామని చెప్పారు.

Read Also- Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి

ఆదివారం నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హెచ్. హనుమంతరావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, విమలక్క, గంగవ్వ తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Premante Trailer: ‘సారం లేని సంసారం వద్దు.. విడాకులే ముద్దు’.. హిలేరియస్!

Tortoise: రాజ్ తరుణ్ మరో ప్రయోగం.. ఈసారి ‘టార్టాయిస్’గా..!

Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో దొరికిన సహకుట్రదారుడు.. సంచలనాలు వెలుగులోకి

Bigg Boss Telugu 9: కుండలు బద్దలవుతున్నాయ్.. రీతూ వర్సెస్ డిమోన్.. అసలైన ఆట మొదలైంది..

Jagriti Janam Baata: సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ మైన్‌ను సందర్శించిన కవిత.. కీలక వ్యాఖ్యలు