Telangana Education: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ల్యాబ్ మ్యాన్యుయల్స్ ప్రింటింగ్ కాపీలను అందించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 6వ తరగతి నుంచి పదో తరగతి స్టూడెంట్లకు సబ్జెక్టుకు 2 చొప్పున కాపీలను పంపిణీ చేయనున్నారు.
Also Read: Ind Vs Pak Final: భారత్-పాక్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు అభిషేక్ శర్మ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు
6, 7 తరగతులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ప్రతి క్లాసుకు 2 కాపీలు, ప్రతి స్కూల్ కు 4 కాపీలు పంపిణీ చేయనున్నారు. 8 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు ఫిజికల్ సైన్స్, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టుల మ్యాన్యుయల్స్ ను ప్రతి క్లాసుకు 2 కాపీలు, ప్రతి స్కూల్ కు 6 కాపీల చొప్పున పంపిణీ చేయనున్నట్లు స్పష్టంచేశారు. ల్యాబ్ లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అప్పుడే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని అధికారులు సూచించారు. ఈ ల్యాబ్ మ్యాన్యుయల్స్ ను టీచర్లు రెగ్యులర్ టీచింగ్ లో భాగంగా మార్చుకోవాలని ఆదేశించారు.