Cyber Crimes: రోజు రోజుకూ పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలు
అప్రమత్తం చేస్తున్నా ఆదమస్తున్న జనాలు
ఇంట్లో ఉండి సెల్‌ఫోన్ చూస్తూ సంపాదించుకోవచ్చంటూ నిరుద్యోగులకు వల
కొంత పెట్టుబడి పెడితే భారీగా సంపాదించవచ్చంటూ ఎర
సైబర్ క్రైమ్ పీఎస్‌లో పెరుగుతున్న కేసులు
వరంగల్, స్వేచ్ఛ: చూడచక్కని రూపంతో ప్రొఫైల్ ఫొటోలు పెడుతారు… ఆకర్షించే మాటలతో స్వీట్‌గా మాట్లాడుతూ స్మార్ట్‌గా ఆకర్షిస్తారు. ఆశలు రేపి ముగ్గులోకి దించి తేరుకునేలోపే దోచేస్తారు. ఒక వైపు సైబర్ క్రైమ్ (Cyber Crimes) పోలీసులు నిత్యం అప్రమత్తం చేస్తున్నా రోజురోజుకజ మోసపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. స్మార్ట్ ఫోన్‌లో వచ్చిన వ్యాపార నోటిఫికేషన్లకు ఆకర్షితులు అయ్యి అనేక మంది క్షణాల్లో లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో కవ్వింపు చర్యలకు ఆకర్షితులవుతున్నారు. మోసపోయి తరువాత బ్లాక్ మెయిల్‌కు గురై కక్కలేక మింగలేక అనేక మంది బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. వెబ్‌సైట్లు, యాప్‌లు సాధనాలుగా మార్చుకుని కష్టం లేకుండా మోసం చేస్తూ అందినకాడికి అక్రమంగా సంపాదించుకునే కేటుగాళ్ల సంఖ్య నిత్యం పెరుగుతుండగా అదే స్థాయిలో మోసపోయే వారి సంఖ్య వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న తీరుపై స్వేచ్ఛ స్పెషల్ స్టోరీ….
ఒకవైపు అప్రమత్తం చేస్తున్నా ఆగని మోసాలు
సైబర్ క్రైమ్ పోలసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం చేస్తున్న చైతన్యం కానీ వారు మోసపోతూనే ఉన్నారు. ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా పెడుతున్నా సైబర్ నేరస్థుల జాడా పూర్తి స్థాయిలో గుర్తించలేక పోతున్నారు. సైబర్ నేరస్తులను పట్టుకోలేకపోతున్నారు. ఊసరవెల్లిలా స్వరూపం మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్ల మోసాల తీరు మారడంలేదు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసుల సంఖ్య నిత్యం పెరుగుతుంది.
అప్రమత్తతే కాపాడుతుంది
ఫోన్ హక్ చేయడం డేటా చోరీ చేసి బెదిరింపు పాల్పడి సొమ్ము కాజేయడం, పోలీస్ అధికారులం మీ పిల్లలు గంజాయి, స్మగ్లింగ్ చేస్తూ దొరికారు, కేసులో ఇరుక్కుంటారు, డబ్బులు ఇస్తే వదిలేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ మోసం చేస్తున్నారు. ఈ తరహా కేసులు వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 6 నెలల్లో 134 కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ రూ.10 లక్షలకు పైబడిన కేసులు మాత్రమే నమోదు చేస్తారు. అంటే పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇలా మోసపోయిన వారి సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ఇంకా చెప్పుకోలేక పోలీసులను ఆశ్రయించనీ వారు అనేక మంది ఉన్నారు. అయితే బాధితులు సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయినట్లు అనుమానం వచ్చిన గంట వ్యవధి (గోల్డెన్ అవర్)లో 1939 ద్వారా ఫిర్యాదు చేస్తే మరింత లాభం ఉంటుంది. కానీ దీనిపై అవగాహన లేక అనేక మంది బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 56 కేసుల్లో బాధితులు రూ.16.24 కోట్లు పోగొట్టుకున్నారు. వారి ఫిర్యాదు తర్వాత నేరస్తుల ఖాతాలను పుట్ ఆన్ హోల్డ్ చేయడం ద్వారా రూ.1.54 కోట్లు ఆగిపోయాయి. 37 కేసుల్లో ఇప్పటికే బాధితులకు కోర్టు ద్వారా నగదు రూ.67.25 లక్షలు చెల్లించారు.
Read Also- Tourism Funds Scam: బీఆర్ఎస్ హయంలో టూరిజం నిధులు పక్కదారి.. ఎన్ని కోట్లు అంటే?
టాస్క్ పూర్తి చేస్తే మనీ ప్రైజ్
ఆన్లైన్ బిజినెస్ ఆఫీసుకు పోకుండానే ఇంట్లో ఉండి తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించే మార్గం అంటూ టెలిగ్రామ్ గ్రూపుల్లో వాట్స్అప్ గ్రూప్లో యాడ్స్ ఇస్తూ యాడ్స్ లో లింక్ ఇచ్చి టాస్క్ పూర్తి చేస్తే మనీ ప్రైస్ అంటే మరొక రకమైన మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్ళు. ముందు తక్కువ డబ్బులు పెట్టుబడి పెడితే కొంత ఎక్కువ అమౌంట్ కలిపి అకౌంటు కొడతారు. ఆ తర్వాత పెంచుతూ పోయి ఎక్కువ అమౌంట్ పెట్టుబడి పెట్టిన తర్వాత మొత్తం డబ్బులు లాగేసుకుంటారు. ఆన్లైన్ వ్యాపారం అంటూ పెట్టుబడి పెట్టించి లూటీ చేయడం మరొక రకమైన మోసం. ఇటీవల ఇటువంటి కేసులు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నమోదు అయ్యాయి. నైమ్ నగర్ లస్కర్ సింగారం చెందిన ఎంబీఏ స్టూడెంట్ రూ.76000 పోగొట్టుకున్నాడు. భీమవరం కు చెందిన మరో యువతి టాస్క్ పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని నమ్మి రూ.1.22000 పోగొట్టుకుంది.
విశ్రాంత పోలీస్ అధికారి కొడుకూ బాధితుడే
ఓ విశ్రాంత డీఎస్పీ కొడుకుకు ఆకట్టుకునేలా ఉన్న ప్రొఫైల్ ఉన్న గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి మతి పోగొట్టే తియ్యటి మాటలు చెప్పింది. చివరికి వీడియో కాల్ లో ఒకరిని ఒకరు చూసుకున్నారు. పెళ్లికాని ఆ యువకుడు ఆమె మాటలకు పూర్తిగా ఆకర్షితుడు అయ్యాడు. ఆమె మాయ మాటల్లో మునిగిన అతడు రూ.18 లక్షల నగదును పోకొట్టుకున్న తరువాత తేరుకున్నాడు. ఇలా అనేక మంది హనీ ట్రాప్లో లో చిక్కుకున్నారు.
Read Also- Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి
డిజిటల్ అరెస్ట్ చేశామని మోసం
కేయూ పీఎస్ పరిధిలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మిమ్మ ల్ని ముంబాయి హవాలా కేసులో డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు బెదిరించారు. దీంతో ఆయన భయపడి సైబర్ నేరగాళ్లు చెప్పినట్లుగా వారికి రూ.91.93 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి మోస పోయాడు.
ఆన్‌లైన్ వ్యాపారమంటూ రూ.38 లక్షలు దోచారు
ఇంట్లో కూర్చుని సంపాదించండి అనే ప్రకటనకు ఆకర్షితీరాలు అయ్యి జనగామకు చెందిన ఓ ప్రోఫెసర్ భార్య ఇంట్లోనే ఆన్లైన్లో వ్యాపారం చేయాలనుకుని సైబర్ నేరస్తులు చెప్పినట్టుగా ముందు రూ.10 వేలు పంపింది. వారి మాటలు నమ్మి రూ.38 లక్షల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయింది. వాట్సాప్ లో వచ్చిన ఒక ఏపీకే ఫైల్ ఓపెన్ చేసి మరో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆన్లైన్ పెట్టు బడి పేరుతో రూ.35 లక్షల పెట్టుబడి పెట్టి చివరకు మోస పోయాడు.
అవగాహన పెంచుకోవాలి… అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాలపై ప్రతీ ఒక్కరికీ అవ గాహన ఉండాలనే ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాధితుల్లో ఎక్కువ మంది చదువుకున్న వారు, ఉద్యోగులు, పలుకుబడి ఉన్నవారే ఉంటున్నారు. ఆన్ లైన్ పెట్టుబడులు, ఆన్ లైన్ బెదిరింపులకు బయపడి డబ్బులు పంపించడం వంటివి చేయవద్దు. ఎవరై నా తెలిసిన వ్యక్తులు డబ్బులడిగితే ప్రొఫైల్ ఫొటో చూసి మోస పోవద్దు. ఫోన్ నంబర్ చెక్ చేసుకోవాలి. ఆన్ లైన్లో పెట్టుబడి పేరుతో నోటిఫికేషన్ వస్తే నమ్మెద్దు. ఎక్కడ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇవ్వరు.
ఇంకా అపరిచిత వ్యక్తుల నుంచి ఆ అవకాశం అస్సలు ఉండదు. అపరిచిత వ్యక్తుల ఫోన్ నుంచి నోటిఫికేషన్ వస్తె ఫోన్లు ఎత్తకుండా కచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆన్ లైన్ లో మోసపో యిన వెంటనే గంటలోపు (గోల్డెన్ అవర్)టోల్ ఫ్రీ 1930 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న నగదును పుట్ అనోల్డ్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో అయ్యే పరిచయాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్ లైన్ మోసాలపై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ వరంగల్ ఏసీపీ కలకోటి గిరికుమార్ సూచించారు.