Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయం సాధించని విషయం తెలిసిందే. అయితే దానిని సెలబ్రేట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ కి మాత్రం ఆరోగ్యం సహకరించలేదు. ఓజీ కన్సార్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ కనిపించలేదు. ఆ రోజు వర్షంలో తడవడంతో ఆయనకు ఫీవర్ వచ్చింది. అప్పటి నుంచి హైదరాబాదులోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశించారు. విషయం తెలునుకున్న అభిమానులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే తాజా పరిస్థితులు చూస్తే పవన్ కాస్త కోలుకున్నట్లు గానే ఉన్నారు. వీలైనంత త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల్లో తిరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Read also-Future City: ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన.. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇక సినిమా విషయానికొస్తే.. ఫైర్ స్ట్రోమ్ ముంబాయ్ లో చేసిన విలయ తాండవానికి అభిమానులు మంత్రముగ్థులయ్యారు. ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కోసమే రాసినట్టుగా, అలాగే ప్రతి ఫ్రేమ్ తీసినట్లుగా చూసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక థమన్ అందించిన సంగీతం వచ్చినపుడల్లా అభిమానులు అయితే ఒక రకమైన తన్మయత్వానికి గురయ్యారు. పవన్ కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరూ మర్చిపోలేరు. రెండో భాగంలో సినిమా బాగా ఆసక్తికరంగా మారుతుంది. ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందు. ముగింపు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఓమీ దేనికోసం సినిమా మొత్తం పోరాడాడో దానితోనే అంతమవుతాడు. చివరిగా పార్ట 2 కి అవకాశం ఉన్నా.. సినిమా ఉంటుందని ఎక్కడా రివీల్ చేయలేదు. మొత్తం గా ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్ గా నిలుస్తోంది.
పవన్ కల్యాణ్ నటించిన ‘ది కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా, సుజీత్ డైరెక్షన్‌లో రూపొందిన యాక్షన్-గ్యాంగ్‌స్టర్ డ్రామా. సెప్టెంబర్ 25, 2025న విడుదలై, మొదటి రోజు రూ.154 కోట్లు గ్రాస్ వసూలు చేసి 2025లో అతిపెద్ద తెలుగు ఓపెనర్‌గా నిలిచింది. కథలో ఓజస్ గంభీర్ (పవన్ కల్యాణ్) తన సత్య దాదా (ప్రకాశ్ రాజ్) మార్గదర్శకత్వంలో కుటుంబ గ్యాంగ్‌స్టర్ వ్యాపారాన్ని నడుపుతాడు. ఒక దారుణ సంఘటన తర్వాత 20 సంవత్సరాలు అదృశ్యుడవుతాడు. తిరిగి వచ్చిన ఓజీ, ప్రతీకారం తీర్చుకోవడానికి రూత్‌లెస్‌గా మారి, ఇమ్రాన్ హాష్మీ (విలన్), ప్రియాంక అరుల్ మోహన్ (ఫీమేల్ లీడ్), శ్రీయ రెడ్డి మొదలైనవారితో కలిసి యాక్షన్, ఎమోషన్స్, ట్విస్ట్‌లతో కూడిన కథ ఉంటుంది. ఈ సినిమా మూడో రోజుకే రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్కును అందుకుంది.
గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ను ఆయన నివాసంలో పరామర్శించి, ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. pic.twitter.com/SrzvL2QXk0
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 28, 2025