thaman-in-og( image :X)
ఎంటర్‌టైన్మెంట్

OG copy controversy: ఆ విషయంలో థమన్‌పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే?

OG copy controversy: పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా అభిమానుల అంచనాలు మించి విజయం సాధించింది. అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది దర్శకుడు సుజిత్, సంగీత దర్శకుడు థమన్. సంగీత దర్శకుడు థమన్ కు అయితే ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఓజీ సినిమా హిట్ కావడంలో థమన్ మేజర్ పాత్ర పోషించారు. అయితే ఒక విషయంలో మాత్రం పవన్ ఫ్యాన్స్ థమన్ ను తిట్టుకుంటున్నారు. ఎందుకంటే సంగీత దర్శకుడు థమన్ ట్యూన్ ఎక్కడో విన్నట్టుగా ఉంటాయి. వాటిని కాపీ కొట్టాడంటూ ఆయా హీరోల అభిమానులు చెబుతుంటారు. ఈ సారి ఓజీ సినిమాలో మెయిన్ ట్యూన్ కే అలాంటి కష్టం వచ్చింది. ‘చాయి హాయ్ తాబాయి.. నామ్ కె ఇష్కా ఓమీ, జుల్మత్ నా కామోషి.. రాక్ కరేగా ఓషి’ అంటూ సాగే విలన్ థీమ్ ను జపనీస్ జానపదం నుంచి కాపీ కొట్టారని మండి పడుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు దీనికి కూడా కాపీ కొట్టావా అంటూ థమన్ ను ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు అభిమానులు అది కాపీ కొట్టడం కాదు దానిని రిషరెన్స్ అంటారు. ఆ ట్యూన్ తీసుకుని అలా వచ్చేలా బీజీఎం చేస్తుంటారు అని చెబుతున్నారు.

Read also-CM Revanth Reddy: విద్యార్థులకు రూ.2 వేల స్కాలర్‌షిప్.. ఏటీసీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

ఇక ‘ఓజీ’ సినిమా విషయానికొస్తే.. ఫైర్ స్ట్రోమ్ ముంబాయ్ లో చేసిన విలయ తాండవానికి అభిమానులు మంత్రముగ్థులయ్యారు. ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కోసమే రాసినట్టుగా, అలాగే ప్రతి ఫ్రేమ్ తీసినట్లుగా చూసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక థమన్ అందించిన సంగీతం వచ్చినపుడల్లా అభిమానులు అయితే ఒక రకమైన తన్మయత్వానికి గురయ్యారు. పవన్ కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరూ మర్చిపోలేరు. రెండో భాగంలో సినిమా బాగా ఆసక్తికరంగా మారుతుంది. ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందు. ముగింపు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఓమీ దేనికోసం సినిమా మొత్తం పోరాడాడో దానితోనే అంతమవుతాడు. చివరిగా పార్ట 2 కి అవకాశం ఉన్నా.. సినిమా ఉంటుందని ఎక్కడా రివీల్ చేయలేదు. మొత్తం గా ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్ గా నిలుస్తోంది.

Read also-he Raja Saab teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ట్రైటర్ విడుదల తేదీ ప్రకటించిన నిర్మాతలు..

పవన్ కల్యాణ్ నటించిన ‘ది కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా, సుజీత్ డైరెక్షన్‌లో తయారైన యాక్షన్-గ్యాంగ్‌స్టర్ డ్రామా. సెప్టెంబర్ 25, 2025న విడుదలై, మొదటి రోజు రూ.90 కోట్లు వసూలు చేసి 2025లో అతిపెద్ద తెలుగు ఓపెనర్‌గా నిలిచింది. కథలో ఓజస్ గంభీర్ (పవన్ కల్యాణ్) తన సత్య దాదా (ప్రకాశ్ రాజ్) మార్గదర్శకత్వంలో కుటుంబ గ్యాంగ్‌స్టర్ వ్యాపారాన్ని నడుపుతాడు. ఒక దారుణ సంఘటన తర్వాత 20 సంవత్సరాలు అదృశ్యుడవుతాడు. తిరిగి వచ్చిన ఓజీ, ప్రతీకారం తీర్చుకోవడానికి రూత్‌లెస్‌గా మారి, ఇమ్రాన్ హాష్మీ (విలన్), ప్రియాంక అరుల్ మోహన్ (ఫీమేల్ లీడ్), శ్రీయ రెడ్డి మొదలైనవారితో కలిసి యాక్షన్, ఎమోషన్స్, ట్విస్ట్‌లతో కూడిన కథ చెబుతుంది.

Just In

01

Deepa Mehta: బాలీవుడ్ స్టార్ యాక్టర్ మొదటి భార్య దీపా మెహతా కన్నుమూత

Telangana Intermediate Board: ఇక పై ఇంటర్ లో ఏఐ కోర్సు..

Ind Vs Pak Final: అదరగొట్టిన బౌలర్లు.. పాకిస్థాన్ ఆలౌట్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్!

Jr NTR: అమ్మమ్మ చెప్పిన కథలు.. తెరపై చూశాక మాటలు రాలేదు

Assembly Restrictions: సోమవారం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు.. ఎందుకంటే?