Nikhil on OG
ఎంటర్‌టైన్మెంట్

Nikhil Siddhartha: నేను 2008లోనే చెప్పా.. ‘ఓజీ’ సినిమాపై నిఖిల్ ఆసక్తికర పోస్ట్!

Nikhil Siddhartha: నేను ఎప్పుడో 2008లోనే చెప్పా. ఈ సీన్ పడితే సినిమా బ్లాక్‌బస్టర్ అని. ‘ఓజీ’ సినిమా (OG Movie) గురించి ‘యువత’ (Yuvatha) ఎప్పుడో ఊహించింది అంటూ యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddhartha) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు నిఖిల్ కూడా వీరాభిమాని అనే విషయం తెలియంది కాదు. ఒక్క నిఖిల్ ఏంటి.. ఆయన ఏజ్ గ్రూప్ ఉన్న హీరోలు చాలా మంది పవర్ స్టార్ ఫ్యాన్సే. అందుకే, ‘ఓజీ’ సినిమా రిలీజ్‌కు ముందు పడిన ప్రీమియర్స్‌కు అంతా క్యూ కట్టారు. బాలానగర్ ‘విమల్’ థియేటర్, కూకట్‌పల్లి ‘విశ్వనాధ్’ థియేటర్, గచ్చిబౌళి ‘ఏఎమ్‌బి సినిమాస్’.. ‘ఓజీ’ని చూసేందుకు వచ్చిన సెలబ్రిటీలతో నిండిపోయాయంటే.. పవన్ కళ్యాణ్ అంటే వారికి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ అందరూ.. ఈ సినిమాను మొదటి రోజు చూసేందుకు ఎగబడ్డారు. అందులో నిఖిల్ కూడా ఒకరు.

Also Read- Mirai Movie: మరో ఆఫర్ ప్రకటించిన ‘మిరాయ్’ నిర్మాత.. పండగ కానుక అదిరింది!

పవన్ కళ్యాణ్‌కు ఇలాంటి సీన్ పడితే..

ఈ సినిమా చూసిన తర్వాత అద్భుతమైన రివ్యూ ఇచ్చిన నిఖిల్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా సినిమాపై మరో పోస్ట్ వేశారు. ఇందులో ‘యువత’ సినిమాలోని ఓ సీన్‌ని పోస్ట్ చేసిన ఆయన పై విధంగా రియాక్ట్ అయ్యారు. ఈ సీన్‌లో సేమ్ టు సేమ్ ‘ఓజీ’ సినిమాలో పవన్ కళ్యాణ్ నడిచి వచ్చి ఒక విలన్ మెడ లేపేసే సీన్ గురించి డిస్కషన్ నడుస్తుంది. నిఖిల్ అండ్ బ్యాచ్ కూర్చుని మందు కొడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇలాంటి సీన్ పడితే బొమ్మ బ్లాక్‌బస్టర్ పక్కా అని మాట్లాడుకుంటున్నారు. సేమ్ టు సేమ్ సీన్ ‘ఓజీ’లో పడిందని, ఇది ఎప్పుడో ఊహించామని నిఖిల్ ఈ ట్వీట్‌లో చెప్పారు. ‘యువత’ సినిమాకు పరశురామ్ దర్శకుడనే విషయం తెలిసిందే. 2008లో వచ్చిన ఈ సినిమా నిఖిల్ కెరీర్‌‌ను టర్న్ చేసిందని చెప్పుకోవచ్చు.

Also Read- R Narayana Murthy: చిరంజీవి చెప్పిందంతా నిజమే.. బాలయ్య కాంట్రవర్సీపై పీపుల్ స్టార్ స్పందనిదే!

‘ఓజీ’ టీమ్‌పై ప్రశంసల వర్షం

ఇక ‘ఓజీ’ విషయానికి వస్తే.. ప్రస్తుతం థియేటర్లన్నీ ‘ఓజీ’ నామస్మరణతో నిండిపోయాయి. ముఖ్యంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాను ఇంత గొప్పగా తీసిన సుజీత్‌కు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు. అలాగే సంగీత దర్శకుడు థమన్‌‌పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిద్దరే కాకుండా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్.. ఇలా సాంకేతిక నిపుణులందరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విడుదలైన రెండు రోజులకే ‘ఓజీ’ సినిమా రూ. 100 కోట్ల షేర్‌ని సాధించిందని ట్రేడ్ నిపుణులు కూడా ప్రకటించేశారు. అలాగే బ్రేకీవెన్‌కు కూడా చాలా దగ్గరగా ఉందని, ఆదివారం లోపు అది కూడా పూర్తవుతుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం మౌత్ టాక్ కూడా పాజిటివ్‌గా ఉంది కాబట్టి.. పవన్ కళ్యాణ్ ఖాతాలోకి మరో బ్లాక్‌బస్టర్ యాడ్ అయినట్లే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Anasuya Bharadwaj: మరోసారి సోషల్ మీడియాలో మంటలు రేపిన రంగమ్మత్త.. ఫొటోలు వైరల్!

K-Ramp: ‘కె-ర్యాంప్’ అంటే బూతు మాట కాదు.. ఏంటంటే..?

Nikhil Siddhartha: నేను 2008లోనే చెప్పా.. ‘ఓజీ’ సినిమాపై నిఖిల్ ఆసక్తికర పోస్ట్!

Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరింపు.. గుండెపోటుతో బాధితురాలి మృతి